Oil Ministry pushing for cut in excise duty ఎక్సైజ్ డ్యూటీ కట్ కోసం మళ్లీ ఎదురుచూపు..

Petrol diesel prices jump oil ministry seeks excise duty cuts

Oil prices, Petrol price, petrol excise duty, Dharmendra Pradhan, Ministry of Petroleum and Natural Gas, diesel petrol prices, Mumbai, Delhi, Union Budget, Arun Jaitley, Finance minister, BJP, finance

The price of petrol in Mumbai touched Rs 80.25 per litre for the first time since August 2014 after fluctuations in the US dollar and the restart of some oil fields in Libya caused the market to waver,

2014 మార్చి నాటి గరిష్టస్థాయికి ఇంధన ధరలు.. ఎక్సైజ్ డ్యూటీ కట్ జరిగేనా.?

Posted: 01/23/2018 06:49 PM IST
Petrol diesel prices jump oil ministry seeks excise duty cuts

ఇంధన ధరలు గత కొన్నాళ్లుగా పైపైకి ఎగబాకుతున్నాయి. ఇదిగో తగ్గింది.. అదిగో తగ్గిందని అశగా ఎదురుచూస్తున్న వాహనదారులకు రోజు రోజు పెరుగుతున్న ధరలు వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా ఇవాళ పెట్రోల్ ధర రూ.80 దాటింది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేర అత్యధిక స్థాయిలను ఇంధనం నమోదు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం పెట్రోల్ ధర ఏకంగా మూడేళ్ల కిందటి గరిష్ట స్థాయికి చేరకుంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.72.38గా రికార్డైందని ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీల రోజువారీ జాబితాలో వెల్లడవ్వగా, ఇక డీజిల్‌ ధర లీటరుకు రికార్డు స్థాయిలో రూ.63.20ను తాకింది. ఇది 2014 మార్చి నాటి గరిష్ట స్థాయి.

అదే ముంబైలో ఈ రేట్లు మరింత అధికంగా నమోదయ్యాయి. లీటరు పెట్రోల్ ధర రూ. 80 మార్కుకు పైనే కోనసాగుతుంది. ఇక డీజిల్ రూ.67.30 వద్దకు చేరుకుంది. ముంబైలో వ్యాట్‌ రేట్లు అధికంగా ఉండటంతో, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అక్కడ మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. డిసెంబర్‌ మధ్య నుంచి డీజిల్‌ ధరలు లీటరుకు రూ.4.86 జంప్‌ చేసినట్టు ఆయిల్‌ కంపెనీల డేటాలో వెల్లడైంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు రెక్కలు రావడంతో, దేశీయంగా ధరలు పెరుగుతున్నాయని ఇంధన మంత్రిత్వశాఖ పేర్కొనింది.

ఈ క్రమంలో ఎక్సైజ్ డ్యూటీని కోత పెట్టాలని ఆయిల్ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరుతుంది. ప్రీ-బడ్జెట్ కు ముందు సమర్పించిన మెమోరాండంలో ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లిఖితపూర్వకంగా సమర్పించింది ఇంధన మంత్రిత్వశాఖ. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల్లో లీటరు పెట్రోల్ పై రూ.19.48 ఎక్సైజ్‌ డ్యూటీ ఉండగా.. డీజిల్ పై రూ.15.33 ఎక్సైజ్ డ్యూటీ ఉంది. ఈ ఎక్సైజ్‌ డ్యూటీలను తగ్గించి, సాధారణ ప్రజలకు కొంత మేర అయినా ఉపశమనం కల్పించాలని అధికారులు తెలిపారు. కాగా ఇంధన ధరలు తగ్గుముఖంలో తొమ్మిది పర్యాయాలు ఎక్సైజ్ డ్యూటీని విధించిన కేంద్రం.. ఒక్కసారి మాత్రమే డ్యూటీని రూ.2మేర కొత విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol prices  Mumbai  Delhi  Union Budget  Arun Jaitley  Finance minister  BJP  finance  

Other Articles