Bajaj Auto introduces Pulsar NS 200 with ABS బజాజ్ నుంచి మరో పల్సర్ మోడల్.. ఏబిఎస్ సిస్టమ్..

Bajaj auto introduces pulsar ns 200 with abs

bajaj pulsar ns200 abs, anti lock braking system, safety feature, pulsar, Bajaj NS 200, NS 200 price

Bajaj Auto on Thursday introduced a new variant of its performance motorcycle model Pulsar NS200 equipped with enhanced safety feature ABS

బజాజ్ నుంచి మరో పల్సర్ మోడల్.. ఏబిఎస్ సిస్టమ్..

Posted: 11/02/2017 09:12 PM IST
Bajaj auto introduces pulsar ns 200 with abs

దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన బజాజ్‌.. తన విజయవంతమైన పల్సర్ బైక్ లలో మరో్ సరికొత్త మోడల్ ను ఇవాళ భారతీయ విఫణిలోకి ప్రవేశపెట్టారు.  సరికొత్త ఏబీఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌) ఫీచర్ తో పల్సర్ ఎన్ఎస్ 200 మోడల్ ను బైక్ ప్రియుల కోసం మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ధరను కూడా కొంత భారీగానే వుంచనున్నట్లు ముందునుంచి వస్తున్న అంచనాల నేపథ్యంలో ఏకంగా రూ.1.09 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది.

డిస్క్ బ్రేకులతో పాటు ఏబీఎస్ తో వస్తున్న ఈ బైక్ వాహన చోదకుల సురక్షిత ప్రయాణానికి ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. అత్యవసరంగా బ్రేకులు వేసినప్పుడు బైక్ ఒక్కసారిగా అతివేగం నుంచి కంట్రోల్ లోకి తీసుకురావడంతో పాటు, జారిపడే అవకాశాలను ఏబీఎస్ తగ్గిస్తుందని తెలిపింది. ‘పెద్దఎత్తున వినియోగదారుల వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ సదుపాయాన్ని ఎన్ఎస్200లో అందిస్తున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఏబీఎస్ టెక్నాలజీతో బైక్ పనితీరు మెరుగుపడడంతో పాటు, ఈ సెగ్మెంట్ లో తాము అత్యున్నత స్థాయిలో నిలిచేందుకు దోహదపడుతుందని సంస్థ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రస్తుతం అన్ని మెట్రో నగరాల్లో ఈ బైక్ ను తొలుత విడుదల చేస్తున్నామని, దశలవారీగా దేశవ్యాప్తంగా డీలర్లందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles