Nokia 2 launched in India with 4100mAh battery రెడ్ ఎంఐకి ఫోటీగా భారీ బ్యాటరీతో నోకియా 2..

Nokia 2 launched in india with 4100mah battery

Nokia 2, Nokia 2 launch, Nokai 2 specs, Nokia 2 price, nokia 2 India price, Nokai 3, HMD Global, redmi, Business, Technology

HMD Global - the Finnish company that holds the rights to manufacture Nokia phones- launched the budget phone Nokia 2 on Tuesday. The phone was launched at an event in New Delhi.

రెడ్ ఎంఐకి ఫోటీగా భారీ బ్యాటరీతో నోకియా 2 4జీ స్మార్ట్ ఫోన్

Posted: 10/31/2017 06:33 PM IST
Nokia 2 launched in india with 4100mah battery

భారతీయ విఫణిలో శరవేగంగా దూసుకెళ్తున్న చౌకధర స్మార్ట్ ఫోన్ అమ్మకాలను అందుకునేందుకు, చైనాకు చెందిన రెడ్ ఎంఐ ఫోన్లకు పోటీగా రంగంలోకి దిగింది నోకియా. నోకియా స్మార్ట్ ఫోన్లను తయారు చేసేందుకు సర్వహక్కులను పోందిన హెచ్‌ఎండీ గ్లోబల్‌ చౌకధరలో భారీ బ్యాటరీ కలిగిన 4జీ స్మార్ట్ ఫోన్ ను ఇవాళ అంతర్జాతీయ విఫణిలోకి ప్రవేశపెట్టింది. దేశరాజధాని ఢిల్లీ వేదికగా నోకియా 2 స్మార్ట్ ఫోన్ ను నోకియా విడుదల చేసింది.

అయితే దీని ధరను 99 యూరోలుగా కంపెనీ పేర్కొంది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 7,500 రూపాయలు. నవంబర్ మధ్య నుంచి ఈ 4జీ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయని ప్రారంభ వేదిక పైనుంచి కంపెనీ ప్రకటించింది. హెచ్ఎండీ గ్లోబల్ ఇప్పటి వరకు విడుదల చేసిన నోకియా బ్రాండు స్మార్ట్ ఫోన్లలో నోకియా 2 మాత్రమే అత్యంత చౌక ధర ఫోన్. దీంతో షావోమి రెడ్ ఎంఐ సహా మోటో సీ స్మార్ట్ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నోకియా 2 స్పెసిఫికేషన్స్:-

5 అంగుళాల ఎల్టీపీఎస్‌ హెచ్‌డీ స్క్రీన్‌, గొర్రిల్లా గ్లాస్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 212 ప్రాసెసర్
1 జీబీ ర్యామ్
8 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
8 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్టీఈ ఫోన్
ఆండ్రాయిడ్‌ 7.1 నోగట్, త్వరలోనే ఓరియో అప్ డేట్
కాపర్ బ్లాక్, క్లియర్ బ్లాక‌, క్లియర్ వైట్ వర్ణాలలో లభ్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles