Airtel to merge Tata Tele mobile operations with itself భారతీ ఎయిర్ టెల్ చేతికి టాటా టెలి సర్వీసెస్

Tata teleservices to sell consumer mobile business to airtel

Tata Teleservices, Airtel, Tata Telesrvices sale, Tata Tele Airtel merger, Bharti Airtel, Tata Teleservices Maharastra, telecom, business news, business

Under the agreement, Bharti Airtel will acquire Tata Teleservices’s consumer mobile business operations across India in 19 circles, boosting its spectrum foot print

టెలికాం రంగంలో మరో మర్జర్.. దిగ్గజం చేతికి నష్టాల కంపెనీ..

Posted: 10/12/2017 06:23 PM IST
Tata teleservices to sell consumer mobile business to airtel

టెలికాం రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందని ఎయిర్ టెట్ చేతికి మరో సంస్థ కూడా చేరింది. మరికొన్ని రోజుల్లో మూత పడబోతున్న టాటా టెలిసర్వీసుల వైర్‌లెస్‌ వ్యాపారాలను భారతీ ఎయిర్ టెల్ అందుకోనుంది. టీటీసీ సంస్థను ఎవరు కొనబోతున్నారు? ఓప్పందాలు జరగుతున్నాయా..? నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఎంత చెల్లించి చేజిక్కించుకోనున్నారన్న వార్తలు టెలికాం రంగంలోని పరిశ్రమలు నిషితంగా పరిశీలిస్తున్నాయి.

అయితే పూర్తి ఉచితంగా ఈ సంస్థను ఎయిర్ టెల్ టేకప్ చేయనుంది. ఈ విషయంపై ఇరు కంపెనీలు అధికారిక ప్రటకన వెలువరించాయి. టాటా టెలీసర్వీసెస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌లో విలీనమవుతుందని కంపెనీలు ప్రకటించాయి. భారతీ ఎంటర్‌ప్రైజ్‌ అధినేత సునిల్‌ మిట్టల్‌తో నాలుగు నెలల పాటు చర్చలు జరిపిన టాటా గ్రూప్‌, తమ వైర్‌లెస్‌ మొబైల్‌ వ్యాపారాలను ఎయిర్‌టెల్‌లో విలీనం చేయాలని నిర్ణయించింది.

ఈ డీల్‌లో భాగంగా టాటాకు చెందిన రూ.10వేల కోట్ల స్పెక్ట్రమ్‌ బాధ్యతను కూడా భారతీ ఎయిరల్ టెల్  తీసుకోబోతుంది. టాటా టెలి దేశవ్యాప్తంగా 19 సర్కిళ్లలో 800, 1800, 2100 మెగాహెడ్జ్‌ బ్యాండుల్లో 180 మెగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. ఈ విషయంపై భారతీ బోర్డు సమావేశమైందని, ఈ ప్రతిపాదనను అంగీకరించింది. భారతీ ఎయిర్ టెల్ బోర్డు అంగీకారం అనంతరం ఈ విషయంపై ప్రకటన వెలువరించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tata Teleservices  Airtel  Tata Tele Airtel merger  Maharastra  telecom  business  

Other Articles