Sensex tops 31,600, RBI rate decision in focus లాభాల జోరు కొనసాగించిన మార్కెట్లు

Sensex ends 174 points higher nifty ends above 9920

RBI Policy, RBI, monetary policy committee, Inflation, Repo rate, BSE, Local Markets, Nifty, NSE, Sensex, indian shares, indian stocks, indian equities, indian rupee, stock market

Sensex and Nifty opened marginally higher and continued to trade with minimal upside in a muted trade activity as the focus of investors and market participants shifts to the outcome of the RBI's bi-monthly monetary policy.

సూచీల లాభాలపై స్వల్ప ప్రభావం చూపిన అర్బీఐ ప్రకటన

Posted: 10/04/2017 04:38 PM IST
Sensex ends 174 points higher nifty ends above 9920

భారతీయ రిజర్వు బ్యాంకు నాలుగో ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో స్వల్పంగా లాభాలను అర్పించుకున్న తరువాత కూడా వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలను అర్జించాయి. అర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం నేపథ్యంలో వడ్డీ రేట్లను అర్బీఐ తగ్గించదని.. పెరుగుతున్న ద్రవ్యోల్భణం నేపథ్యంలో యథాతధంగా కొనసాగిస్తుందన్న విశ్లేషకుల అంచానాల మేరకు ఉదయం నుంచి మార్కెట్లు లాభాల్లో ఉరకలు వేశాయి. సమీక్ష ఫ్రకటనను పరిగణలోకి తీసుకున్న మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు జోరందుకున్నాయి.

ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. క్రమంగా లాభాలను అందుకున్నాయి. అయితే మదుపరులు అంచనాలకు తగ్గట్టుగానే అర్బీఐ కూడా వడ్డీ రేట్లను యథాతథంగా వుంచుతూ నిర్ణయం తీసుకోవడంతో.. ఆ ప్రభావం స్వల్పంగా లాభాలపై పడింది. 23 పాయింట్ల స్వల్ప లాభంతో 31,520 వద్ద ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్‌.. కొనుగోళ్ల మద్దతుతో మధ్యాహ్నానికి భారీ లాభాల దిశగా దూసుకెళ్లింది. ఒకానొక దశలో 200 పాయింట్లకు పైగా ఎగబాకింది.

అయితే ఆర్బీఐ నిర్ణయం తర్వాత కాస్త నెమ్మదించిన సూచీ.. చివరకు 174 పాయింట్లు లాభపడి 31,672 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 55 పాయింట్ల లాభంతో 9,915 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 65.00గా కొనసాగుతోంది. ఈ క్రమంలో రిలయన్స్, సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ‌, హిందుస్థాన్ పెట్రోలియం షేర్లు అత్యధిక లాభపడగా.. భారతీ ఎయిర్ టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్‌, ఐషర్ మోటార్స్‌, యాక్సిస్ బ్యాంక్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI Policy  RBI  monetary policy committee  Inflation  Repo rate  BSE  Local Markets  Nifty  NSE  Sensex  

Other Articles