Apple, Jio launch iPhone 8, 8 plus in India భారతీయ విఫణిలోకి యాపిల్ ఐఫోన్ 8, 8 ప్లస్

Iphone 8 plus iphone 8 go on sale in india

iPhone 8, iPhone 8 Plus, iPhone 8 buyers, iPhone 8 Plus buyers, iPhone 8 design, iPhone 8 Plus design, Jio SIM, iPhone 8 camera, mobiles, smartphones, business, technology

The iPhone 8 and the iPhone 8 Plus are on sale in India. The sale started from today, which is in a way something new given the fact that these phones were launched globally just two weeks ago

భారతీయ విఫణిలోకి యాపిల్ ఐఫోన్ 8, 8 ప్లస్..

Posted: 09/29/2017 06:02 PM IST
Iphone 8 plus iphone 8 go on sale in india

భారత స్మార్ట్ ఫోన్ ప్రియుల ప్రపంచంలో ఉత్కంఠను రాజేసిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆపిల్ తాజాగా తన నూతన ఉత్పాదనను భారతీయ విఫణిలోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లోకి ఇవాళ విడుదల చేసింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని కొత్త వస్తువులు కొనుగోలు చేసే సంప్రదాయమున్న భారతీయులకు ముంగిట్లోకి వచ్చేసింది. ఐఫోన్ నూతన డివైస్ ల కోసం అసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్ ప్రియులను ఐఫోన్ 8. ఐపోన్ 8 ప్లస్ లు మురిపిస్తాయని సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ సందర్భంగా ఐఫోన్ 8. ఐపోన్ 8 ప్లస్ కొనుగోలు చేసిన కస‍్టమర్లకు ఓ ఆకర్షణీయమైన ఆఫర్ ను రిలయన్స్ జియో అందిస్తోది. సిటీ బ్యాంక్ కార్డ్ ద్వారా బుక్ చేసుకుంటే ఐ ఫోన్ 8 , 8 ప్లస్ పై భారీ క్యాష్ బ్యాక్‌ అందిస్తోంది. ఇవాళ భారత్ లో ప్రవేశపెడతున్న సందర్భంగా ఈ ఒక్క రోజు కొనుగోలు చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ అఫర్ వర్తించనుంది. ఈ సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌ కు సంబంధించిన స్పెషల్ ఏవీని ప్రదర్శించారు.

దీంతో పాటు రిలయన్స్‌ డిజిటల్‌, జియో.కాం ద్వారా ఐఫోన్‌ 8, 8 ప్లస్ కొనుగోలు చేసిన వారికి 70శాతం క్యాష్‌బ్యాక్‌ (బై బ్యాక్‌) ఆపర్‌ అందిస్తోంది. ఈ పథకంలో ఐఫోన్‌ 8, ఐ ఫోన్‌ 8ప్లస్‌ కొనుగోలు చేసి,  జియో వినియోగదారులకు ఏడాది తరువాత ఆ క్యాష్‌ బ్యాక్‌ అందిచనుంది. నెలకు రూ.799 జియో ప్యాక్‌ వినియోగదారులకు మాత్రమే బై బ్యాక్ గ్యారెంటీ అందుబాటులో ఉంటుంది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ అంబానీ వీటిని లాంచ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : iPhone 8  iPhone 8 Plus  design  Jio SIM  iPhone 8 features  E-commerce  business  technology  

Other Articles