Nokia 6 sale in India for first time నేటి నుంచే నోకియా 6 స్మార్ట్ ఫోన్ అమ్మకాలు..

Nokia 6 to go on sale in india starting today

sale nokia 6, nokia 6, nokia 6 specs, nokia 6 specifications, nokia 6 price, nokia 6 sale, nokia 6 amazon sale, nokia 6 price in india, nokia 6 launched in india, nokia 6 specs, nokia 6 price in india, nokia 6 price, nokia 6 battery, nokia 6 vs redmi 4, mobiles, smartphones, E-commerce, business, technology

Nokia 6 sale for the first time in India at Amazon.in started now. The mid-range smartphone from HMD Global has received over one million registrations on Amazon ahead of the sale.

భారతీయ విఫణిలోకి నోకియా 6 స్మార్ట్ ఫోన్‌.. ధరెంతో తలుసా.?

Posted: 08/23/2017 12:11 PM IST
Nokia 6 to go on sale in india starting today

భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నోకియా 6 స్మార్ట్ ఫోన్ ఇవాళ్టి నుంచి భారతీయ విఫణిలోకి అందుబాటులోకి వచ్చింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసిన మాద్యమిక స్థాయి ఆండ్రాయిడ్‌ స్మార్ట్ ఫోన్‌ విక్రయాలు ఇవాళ్టి నుంచే ప్రారంభమయ్యాయి. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ఇండియాలో ఇవాళ్టి నుంచే అమ్మాకాలు జరుగుతున్నాయి. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది అమెజాన్ సంస్థ.

జూన్‌లో నోకియా 3, నోకియా 5తో పాటు ఈ స్మార్ట్ ఫోన్ ను హెచ్ఎండీ గ్లోబల్ లాంచ్ చేసింది. మిగతా రెండు స్మార్ట్‌ఫోన్లు ఆఫ్‌లైన్‌ స్టోర్లలో విక్రయానికి వచ్చాయి. నోకియా 6పై మాత్రం ఎంతో హైప్ చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ ఫోన్ అన్ లైన్ లో మాత్రమే విక్రయానికి పెట్టగ్గా.. ప్రీ బుక్కింగ్స్ లోనే దాదాపు 10 లక్షల మంది ఈ ఫోన్ కావాలని రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో ఈ ఫోన్ పై అంచనాలు స్మార్ట్ ఫోన్ ప్రియుల స్తాయికి తగ్గట్టుగా వున్నాయని టాక్. అయితే బ్యాటరీ విషయంలో మాత్రం అంచానాలు తప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

కాగా, ఈ ఫోన్ లాంచ్ ఆఫర్లను కూడా అమెజాన్ లిస్టు చేసింది. అవేంటో కూడా చూద్దామా..
 
నోకియా 6 ధర 14,999 రూపాయలు.
అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు రూ.1000 డిస్కౌంట్
అమెజాన్‌ పే బ్యాలెన్స్‌. కిండ్లీ బుక్స్‌పై 80 శాతం తగ్గింపు.
మేక్‌మైట్రిప్‌లో రూ.2500 డిస్కౌంట్‌. ఐదు నెలల వ్యవధిలో 45జీబీ ఉచిత డేటా.

 
నోకియా 6 స్పెషిఫికేషన్లు:-

5.5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే
స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (128జీబీ వరకు ఎక్ట్సెండబుల్ మెమరీ)
డ్యూయల్‌ సిమ్‌
16 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
ఆండ్రాయిడ్ నోగట్ 7.1.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రోటెక్షన్
మేట్‌ బ్లాక్‌, సిల్వర్‌, టాంపర్డ్‌ బ్లూ వేరియంట్లలో లభ్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nokia 6  launch  Indian market  Amazon  E-commerce  business  technology  

Other Articles