Sensex, Nifty end lower post RBI policy అర్బీఐ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన మార్కెట్లు

Sensex nifty end lower post rbi policy

BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

The Sensex was down 98.43 points at 32476.74, while the Nifty was down 33.15 points at 10081.50.

అర్బీఐ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన మార్కెట్లు

Posted: 08/02/2017 08:16 PM IST
Sensex nifty end lower post rbi policy

మెజార్టీ విశ్లేషకుల అంచనాల ప్రకారమే రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా మానిటరీ పాలసీని ప్రకటించింది. రెండు రోజుల సమావేశ నేపథ్యంలో మంగళవారం భేటీ అయిన గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ, కీలక వడ్డీరేటు రెపోను పావు శాతం తగ్గించినట్టు బుధవారం ప్రకటించింది. దీంతో ప్రస్తుతమున్న 6.25 శాతం రెపో రేటు, 6 శాతానికి దిగొచ్చింది. ప్రభుత్వ వర్గాల నుంచి పారిశ్రామిక ప్రతినిధుల నుంచి రెపో రేటు తగ్గింపునకు పెద్ద ఎత్తున డిమాండ్‌ రావడంతో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గత 10 నెలల కాలంలో మొట్టమొదటిసారి ఆర్బీఐ ఈ రేటు కోతను చేపట్టింది.
 
రెపో రేటు అంటే బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వడ్డీరేటు. ద్రవ్యోల్బణ భయాల కారణతో ఇన్నిరోజులు యథాతథ రేటును కొనసాగిస్తూ వచ్చిన ఆర్బీఐ, ఇటీవల ద్రవ్యోల్బణ గణాంకాలు తీవ్ర కనిష్ట స్థాయిలకు పడిపోవడంతో కోత నిర్ణయం ప్రకటించింది. త్రైమాసికంగా జరిగే ప్రతీ విధాన సమీక్షలోనూ మార్కెట్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ.. నిరాశపర్చిన రిజర్వు బ్యాంకు ఈ సారి జరిగిన విధాన సమీక్షలో మాత్రం మార్కెట్లకు శుభవార్తను అందించింది. అయితే రిజర్వు బ్యాంకు అంచనాలపై మార్కెట్ వర్గాలు మాత్రం మిశ్రమంగా స్పందించాయి.

ఆరంభం నుంచి ఊగిసలాటల మధ్య ఉన్నప్పటికీ కీలక వడ్డీరేట్లలో 0.25 శాతం తగ్గింపును ప్రకటించడంతో మార్కెట్లలో నష్టాల్లోకి జారుకున్నాయి. కీలక ల్యాండ్ మార్కుగా నిలిచిన 25వేలకు ఎగువన ఉన్నప్పటికీ, స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. ఒకదశలో సెన్సెక్స్‌ 100 పాయింట్లు క్షీణించి 32,301 పాయింట్ల వద్ద.. నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 10,083 స్తాయికి మళ్లాయి. అనంతరం దాదాపు 50 పాయింట్లు రికవరీ అయ్యాయి.   బ్యాంక్‌ నిఫ్టీ కూడా నష్టాలను తగ్గించుకుంది. ఎస్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఓన్‌జీసీ నష్టాల్లోనూ సన్‌టీవీ, బయోకాన్‌, వోల్టాస్‌ లాభాల్లోను కొనసాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles