Oppo F3 with dual front camera launched in India రెండు సెల్పీ కెమెరాలతో.. భారతీయ విఫణిలోకి ఒప్పో ఎఫ్‌ 3

Oppo f3 first impressions at rs 19990 the latest selfie smartphone

oppo f3, oppo f3 review, oppo f3 first impressions, oppo, oppo f3 first look, oppo f3 features, oppo f3 india price, oppo f3 specs, mobiles, smartphones, technology, technology news

Oppo launched another “Selfie Expert” - the Oppo F3, at an event in India. The smaller sibling of the F3 Plus has a dual front camera setup - a 16 MP unit with 1/3.1” sensor size and f/2.0 aperture along with an 8 MP F/2.4 wide-angle one for selfies with all your friends.

రెండు సెల్పీ కెమెరాలతో.. భారతీయ విఫణిలోకి ఒప్పో ఎఫ్‌ 3

Posted: 05/04/2017 08:24 PM IST
Oppo f3 first impressions at rs 19990 the latest selfie smartphone

నేటి తరం సెల్పీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో.. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునే విధంగా మొబైల్ ఫోన్ ను తయారు చేసిన కెమెరా ఫోన్స్ కాన్సెప్టు తో మార్కెట్‌ లోకి దూసుకొచ్చిన   చైనా మొబైల్‌ దిగ్గజం  'ఒప్పో' తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను   ఇవాళ లాంఛనంగా భారత విఫణిలోకి విడుదల చేసింది. సరసమైన ధరతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. డబుల్‌ సెల్పీ కెమరాలతో స్పెషల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ స్కై లీ ఇవాళ ముంబైలో ఆవిష్కరించారు.

సెల్ఫీలకు క్రేజ్ అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో... వినయోగదారుల అవసరాలకు తగిన విధంగా, వారి అభిరుచికి తగినట్లుగా ఒప్పో డివైస్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు లీ వెల్లడించారు. గత కొంతకాలంగా స్మార్ట్ ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒప్పో ఎఫ్‌ 3 ధరను రూ.19,900గా కంపెనీ నిర్ణయించింది. అలాగే ఇవాళ్టి నుంచి మే 12 వరకు ప్రి ఆర్డర్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఇక దీంతో పాటు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులలో ముగ్గురు లక్కీ విన్సర్స్‌ మరో బంపర్‌ ఆఫర్‌ కూడా ప్రకటించింది. లండన్‌ లోజరిగే  ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫీ ఫైనల్‌ కు ఉచిత ట్రిప్‌ను అందించనుంది.

2.0 వెర్షన్ కు చెందిన ఒప్పో ఎఫ్ 3 ఇతర ఫీచర్స్‌ విషయానికి వస్తే 5 అంగుళా ఫుల్‌ హెచ్డీ డిస్‌ప్లే,  16 ఎంపి సెల్పీ కెమెరా, 13ఎంపీ రియర్‌ కెమెరా, 4జీబీ ర్యామ్‌ 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 3200ఎంఏ హెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఫ్రంట్ లో సెల్ఫీ కోసం ఒక కెమెరాను , గ్రూప్‌ సెల్ఫీకోసం మరో కెమెరాను అమర్చింది. అలాగే ట్రిపుల్‌ స్లాట్‌ ట్రే కార్డును( రెండు 4 జీ సిమ్స్‌, ఒక మొమరీ కార్డు) అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ తో పాటు సెల్పీ క్రేజ్ వున్నవారు అప్పో ను సోంతం చేసుకోవడం మంచిదని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oppo F3  Selfie smartphone  dual front camera  Indian market  

Other Articles