చారిత్రక గరిష్టాలను అందుకున్న దేశీయ సూచీలు Sensex ends at record high, Nifty above 9250

Sensex ends at record high nifty above 9250

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

Benchmarks have ended the day on a high note, driven by a rally in index heavyweights, ahead of the RBI’s monetary policy meeting’s outcome.

చారిత్రక గరిష్టాలను అందుకున్న దేశీయ సూచీలు

Posted: 04/05/2017 05:21 PM IST
Sensex ends at record high nifty above 9250

ప్రపంచ మార్కెట్ల గమనం ప్రతికూలం దిశగా కొనసాగుతున్నా.. దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం చారిత్రాత్మక గరిష్టాలను తాకుతూ.. మునుపెన్నడూ తాకని ఉన్నత శిఖరాలను అందుకుని రికార్డులను నమోదు చేసుకుంటున్నాయి. అల్ టైం హై రికార్డులను నమోదు చేసుకుంటూ మదుపరులలో కొత్త జోష్ ను నింపుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 30,007 వద్ద ఆల్‌ టైం హై స్థాయిని తాకగా నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. నిఫ్టీ ఇంట్రాడేలో 9,268ని చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది.  

ఉదయం ప్రారంభం నుంచే మార్కెట్లు పాజిటివ్ గా ట్రెండ్ అవుతున్నాయి. గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌ మధ్య ఊగిసలాడిన మార్కెట్లలో మిడ్‌సెషన్‌ అనంతరం కొనుగోళ్ళ ధోరణి నెలకొంది. మరోవైపు ఇండెక్స్‌ హెవీ వెయిట్‌ రిలయన్స్‌   లాభాలు  మార్కెట్లకు  మరింత ఊతమిచ్చింది. మిడ్‌ క్యాప్‌ షేర్లు  కూడా భారీగా లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ గరిష్ట స్థాయిలో 64 పాయింట్ల లాభంలో 29,974 వద్ద క్లోజైంది. నిఫ్టీ సైతం 27 పాయింట్ల లాభంలో 9250కి పైనే ముగిసింది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ తప్ప దాదాపు అన్ని రంగాలు పాజిటివ్‌గా ఉన్నాయి. రియల్టీ,  పీఎస్‌యూ బ్యాంక్‌, మెటల్‌, ఆటో రంగాలు 1 శాతం స్థాయిలో  పురోగమించాయి.

హెచ్‌డీఎఫ్‌సీ, కోల్ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఐటీసీ , ఇన్ఫోసిస్‌ నష్టాల్లో నడువగా, మారుతీ సుజుకి, అదానీ పోర్ట్స్‌ 4 శాతం చొప్పున దూసుకెళ్లగా.. ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో, జీ, ఆర్‌ఐఎల్‌, గ్రాసిమ్‌, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, బీవోబీ 3-2 శాతం మధ్య లాభపడ్డాయి. దీంతో ఎనలిస్టులు కూడా పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. అయితే ఈ స్తాయిల్లో కొంత ప్రాఫిట్‌ బుక్‌ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కాగా ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష గురువారం జరుగనున్న నేపథ్యంలో పెద్దగా మార్పులు వుండకపోవచ్చునన్న సంకేతాలు కూడా మార్కెట్లను అశాజకంగా వుంచాయి.

NOTE: We inform you that we are not owner of any of the products, images or any other products displaying on our website. But all the articles are written by us and we owned them. If you found any image or product that found under your copyrights then please feel free to CONTACT US. We will remove that image or product as soon as possible. All the images are collected from Google.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles

Today on Telugu Wishesh