గృహ, వాహన రుణదాతల అశలపై నీళ్లు.. యథాతథంగా కీలక వడ్డీరేట్లు RBI Keeps Interest Rates Unchanged At 6.25%

Rbi keeps interest rates unchanged at 6 25

RBI repo rate, rate kept unchanged, Urjit Patel, RBI, rate cut, key rates, repo rate, reverse repo rate, crr rate, economics, business

The Reserve Bank of India kept its repo rate on hold at 6.25 percent for a second straight policy meeting, opting to wait for more clarity on inflation trends and on how a radical crackdown on "black money" is impacting economic growth.

గృహ, వాహన రుణదాతల అశలపై నీళ్లు.. యథాతథంగా కీలక వడ్డీరేట్లు

Posted: 02/08/2017 05:41 PM IST
Rbi keeps interest rates unchanged at 6 25

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆరవ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో  కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లకు ఎలాంటి సర్ ప్రైజ్ లేకుండా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది.. ఆర్బీఐ నిర్వహించిన క్రెడిట్ పాలసీ రివ్యూలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు తెలిపింది. రెపో రేటును 6.25శాతంగా, రివర్స్ రెపో రేటును 5.75 శాతంగా ఉంచుతున్నట్టు పేర్కొంది. బ్యాంకు రేటు 6.75 శాతంగా అమలుకానుంది.

ఆర్‌బీఐ గవర్నర్‌ గా ఉర్జిత్‌ పటేల్‌  నేతృత్వంలో జరుగుతున్న మూడవ సమీక్ష ఇది. మెజారిటీ ప్రాతిపదికన రేట్ల నిర్ణయం తీసుకోడానికి ఆరుగురు సభ్యులతో పరపతి విధాన కమిటీ (ఎంసీపీ) ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న 3వ సమావేశాల్లో గృణ, వాహన, కార్పొరేట్ రంగాల రుణదాతలు ఎంతో అశగా ఎదురుచూసినా.. ఆర్బీఐ మాత్రం వారి అశలపై నీళ్లు చల్లింది. వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయని ఆశించిన రుణగ్రస్తులకు షాక్ ఇస్తూ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు పేర్కోంది.

డీమానిటైజేషన్‌ తర్వాత RBI నిర్వహించిన రెండో పరపతి విధాన సమీక్ష కావడంతో రుణగ్రస్తులు వడ్డీ రేట్లు తగ్గుముఖం పడతాయని అశించారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులు గల మానిటరీ కమిటీ ఈ నిర్ణయం వెలువరచగానే, మార్కెట్లో నష్టాలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ తరువాత కొద్దిసేపటికి ముగింపుకు చేరకున్న మార్కెట్లు ప్లాట్ గానే ముగిశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles