బడ్జెట్ ఎఫెక్ట్: భారీ లాభాల్లో దేశీయ సూచీలు.. Stock markets hail Budget, Sensex rallies 486 points

Stock markets hail budget sensex rallies 486 points

arun jaitley, budget 2017, Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

Indian markets closed on a high note following the Union Budget, with the sensex rising 485.68 points to close at 28,141.64 and the Nifty gaining 155.10 points to end the day at 8,716.40.

బడ్జెట్ ఎఫెక్ట్: 486 పాయింట్ల లాభంతో సెన్సెక్స్.. 8700 మార్కుకు ఎగువన నిఫ్టీ

Posted: 02/01/2017 06:02 PM IST
Stock markets hail budget sensex rallies 486 points

పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం.. అయితే తనదైన ముద్రతో బడ్జెట్ ను రూపోందించడంతో పాటు పారిశ్రామిక ప్రగతికి నిధులను కేటాయించడంతో మదుపరులు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 ఆర్థిక బడ్జెట్ కు సంపూర్ణ మార్కులను వేశారు. నెగిటివ్ సర్ ప్రైజ్ లు ఏమీ లేని కారణంగా మదుపరులు బడ్జెట్ ను స్వాగతిస్తూ.. అ మేరకు పెట్టుబడులకు అసక్తి కనడబర్చడంతో మార్కెట్లు ఊపందుకుని క్రమంగా లాభాల వైపు పయనించాయి. దీంతో  దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.  

ముఖ్యంగా పన్నుచెల్లింపు పరిమితి సగానికి తగ్గించడం, బ్యాంకులకు  కొత్త పెట్టబడులు,  చౌక గృహాల ప్రాజెక్టులకు ఇన్ఫ్రా హోదా, మౌలిక సదుపాయాల రంగానికి భారీ కేటాయింపులతో అప్పటివరకు స్తబ్దుగా ఉన్నమార్కెట్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.  ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్లతో చివరి వరకూ జోరును  కొనసాగించిన మళ్లీ మార్కెట్లు బడ్జెట్‌ రోజు అత్యధిక స్థాయిలో 1.8 శాతం  ఎగిశాయి. 2005 నాటి స్థాయిని తాకాయి.  

సెన్సెక్స్‌ 486 పాయింట్లు దూసుకెళ్లి 28,142 వద్ద నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 8,716 వద్ద  ముగిసింది. మరోవైపు అక్టోబర్‌ 24 తరువాత నిఫ్టీ మళ్లీ 8,700కు ఎగువన ముగియడం విశేషం.ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకులకు రూ. 10,000 కోట్లమేర కొత్త పెట్టుబడులు అందించనున్నట్లు జైట్లీ ప్రకటనతో బ్యాంక్‌ నిఫ్టీ జోరు పెంచింది. దాదాపు అన్ని బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కాగా 1935 సంస్థల షేర్లు లాభాలలో పయనించగా, 890 సంస్థల షేర్లు నష్టాలలో ముగియగా, 118 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి.

బాష్‌ టాప్ విన్నర్ గా, మారుతీ, బీవోబీ, ఐషర్‌, ఐసీఐసీఐ, ఐటీసీ, హిందాల్కో, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌, స్టేట్‌బ్యాంక్‌ 5-4 శాతం లాభాల్లో ముగిశాయి. అయితే ఇంత హోరులో కూడా ఐటీ,  ఫార్మ సెక్టార్లో  బలహీనత కొనసాగడం గమనార్హం.   హెచ్‌ 1బీ వీసాలపై ఆందోళనలతో వరుసగా రెండో రోజు కూడా ఐటీ లో అమ్మకాలు కొనసాగాయి.  టీసీఎస్‌, అరబిందో, ఐడియా, ఇన్ఫోసిస్‌, ఓఎన్‌జీసీ, భారతీ, సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, డాక్టర్ రెడ్డీస్‌  భారీగా నష్టపోయాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arun jaitley  budget 2017  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles