ఎయిరిండియా బంఫర్ ఆఫర్: రాజధాని దరల్లో విమానయానం Travel in Air India at Rajdhani Fares

Air india starts selling tickets at rajdhani fares

air fares war, air india, rajdhani fares, cheapest air fares, rajadhani train fares, Air India Republic Offer, Air India Rs 1610 offer

National carrier Air India has again introduced special fares under Republic Day offer, matching Rajdhani Express's AC II ticket prices on select domestic sectors.

ఎయిరిండియా బంఫర్ ఆఫర్: రాజధాని దరల్లో విమానయానం

Posted: 01/06/2017 05:39 PM IST
Air india starts selling tickets at rajdhani fares

ప్రభుత్వ విమానయాస సంస్థ ఎయిరిండియా కూడా చౌరధర పోటీలలోకి అడుగుపెట్టింది. దేశీయ విమానయాన మార్గల్లో ఎంపిక చేసిన రూట్లలో రాజధాని రైలు ధరల్లోనే విమానయాన అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించి. ఒక్కసారిగా విమానటికెట్ల ధరలను తగ్గించింది. రిపబ్లిక్ డే ఆఫర్ కింద అత్యంత చౌక ధరలకే విమానటికెట్లను అందిస్తామని ఊరిస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ టూటైర్ టికెట్ల ధరలకు స్వదేశీ రూట్లలో ఎకానమీ క్లాస్ టికెట్లు ఇవ్వబోతోంది. ఈ ఆఫర్ కింద జనవరి 26 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ప్రయాణాలు చేయొచ్చు. ఏప్రిల్ పదో తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే, ప్రయాణానికి కనీసం 20 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి.
 
ఇందులో అత్యల్పంగా ఢిల్లీ-జమ్ము మార్గంలో రూ. 1610కే టికెట్ అందుబాటులో ఉంది. ఢిల్లీ-ముంబై మార్గంలో రూ. 2401, ఢిల్లీ-బెంగళూరు మార్గంలో రూ. 2952, ఢిల్లీ-చెన్నై మార్గంలోరూ. 3100 చొప్పున టికెట్ల ధరలను నిర్ణయించారు. అయితే ఈ పథకం కింద ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో మాత్రం ఎయిరిండియా వెల్లడించలేదు. పరిమితంగానే సీట్లున్నాయని, అందువల్ల ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపదికన వాటిని కేటాయిస్తామని మాత్రం తెలిపింది. రైలు టికెట్ ధరతోనే, అంతకంటే తక్కువ సమయంలో గమ్యస్థానాలు చేరుకోవచ్చని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ప్రత్యర్థి విమానయాన సంస్థలు గో ఎయిర్, ఇండి గో, ఎయిర్ ఏషియా, జెట్ ఎయిర్‌వేస్ లాంటివి ఇప్పటికే ఆఫర్లతో వెల్లువెత్తిస్తున్నాయి. లేటుగా వచ్చినా ఎయిరిండియా విభిన్నమైన ఆఫర్ ప్రకటించడంతో ప్రయాణికులను ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles