వారంతంలో మార్కెట్లకు లాభాలు.. 155 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ Sensex, Nifty at day's high ahead of F&O expiry

Sensex closes up 155 points ahead of december f o expiry

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

IT, metals and oil & gas stocks are lending support to the market. TCS, ONGC, HUL, HDFC and Wipro are top gainers while Adani Ports, Sun Pharma, Dr Reddy's Labs, L&T and ITC are losers in the Sensex.

వారంతంలో మార్కెట్లకు లాభాలు.. 155 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్

Posted: 12/29/2016 05:21 PM IST
Sensex closes up 155 points ahead of december f o expiry

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలను అందుకున్నాయి. ఉదయం నుంచి లాభనష్టాల మధ్య కుదుపులకు గురైన మార్కెట్ ముగింపు సెషన్ లో లాభాలను అర్జించాయి. ఇవాళ్టి లాభాలతో మార్కెట్లు ఏకంగా వారం గరిష్టస్థాయికి చేరుకున్నాయి. ఇవాళ్టితో డిసెంబర్ మాసం డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు లాభాలను అర్జించడం శుభసూచకంగా ట్రేడింగ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

ఇవాళ ఉదయం మార్కెట్లు ఆరంభంలో తటస్థంగా ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒడిదోడుకులకు లోనయ్యాయి. ఉదయం పది గంటలకు సమయానికి సెన్సెక్స్ 12.72 పాయింట్ల నష్టంలో 26,197 పాయంట్ల వద్ద కొనసాగగా, నిఫ్టీ 2.15 పాయింట్ల లాభాల్లో 8,037గా నమోదైంది. కాగా ముగింపు సమయానికి లాభాలను అందుకున్న మార్కెట్లు వారం గరిష్టస్థాయిని అందుకున్నాయి. సెన్సెక్స్‌ 155 పాయింట్లు పెరిగి 26,366 వద్ద ట్రేడింగ్ ను ముగించగా, ఇటు నిఫ్టీ కూడా 69 పాయింట్ల లాభంతో 8,104 వద్ద స్థిరపడి కీలకమైన 8,100 ఎగువన ముగిసింది.

ఇవాళ అటో, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య, అయిల్ అండ్ గ్యాస్, కన్జూమర్ డ్యూరబుల్స్, బ్యాకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, మెటల్స్ సూచీలు ర్యాలీలు కోనసాగించి భారీ లాభాలను అందుకున్నాయి. కాగా ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, ఊటీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, ఐటీ సహా అన్ని సూచీలు లాభాలలోనే పయనించాయి. కాగా క్యాపిటల్ గూడ్స్ సూచీ మాత్రం నష్టాలను అందుకుంది. ఈ క్రమంలో గ్రాసిమ్, బిసిసీఎల్; యస్ బ్యాంక్, ఏషియర్ మోటార్స్, బాస్చ్, తదితర సంస్థల షేర్లు అత్యధికంగా లాభాలను అర్జించగా, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, లార్సెన్, అరబిందో ఫార్మ, ఇన్పోసిస్ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో పయినించాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles