ఒడిదోడుకుల మధ్య తటస్థంగా ముగిసిన మార్కెట్లు Sensex, Nifty close flat after market erases gains

Sensex erases early gains closes down by 3 points

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

Market washed out earlier gains as S&P BSE benchmark Sensex and NSE 50-share Nifty ended steady at 26,210.68 and 8,034.85 due to fag-end selling pressure from operators

ఒడిదోడుకుల మధ్య తటస్థంగా ముగిసిన మార్కెట్లు

Posted: 12/28/2016 06:32 PM IST
Sensex erases early gains closes down by 3 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ తటస్థంగా ముగిశాయి. ఇవాళ లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదొడుకులకు గురైన సెన్సెక్స్ చివరకు స్వల్ప నష్టంలో ముగిశాయి. అటు నిఫ్టీ మాత్రం స్వల్ప లాభాలన్ని అర్జించింది. గత మూడు వారాలగా ఎన్నడూ అర్జించనంత అత్యంత భారీ లాభాలను నిన్న అర్జించిన మార్కెట్లు ఉదయం మాత్రం లాభాలలో దూసుకెళ్లాయి. కానీ సాయంత్రానికి లాభాలన్నీ హరించుకుపోగా మార్కెట్లు తటస్తంగా ముగిశాయి.

గత కొన్ని సెషన్లగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న మార్కెట్లు లాంట్ టర్మ్ కాపిటల్ లాభాలపై పన్నులు వుండవన్న కేంద్ర ఆర్థిక మంత్రి  అరుణ్ జైట్లీ హామీతో నిన్న పుంజుకున్న మార్కెట్లు భరోసాతో బౌన్స్ బ్యాక్ కాగా, అదే జోరుతో ఇవాళ ఉదయం కూడా మార్కెట్లు పుంజుకున్నాయి. అయితే మదుపురులు అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో సాయంత్రానికి లాభాలన్నీ హరించుకు పోయాయి. డిసెంబర్ మాసం డెరివెటివ్స్ గడవు ఇవాళ్టితో ముగుస్తున్న తరుణంలో మదుపరులు అమ్మకాలకు దిగారు.

ఈ నేపథ్యంలో మార్కెట్లు ముగింపు సమయానికి సెన్సెక్స్ 3 పాయింట్ల నష్టంతో 26 వేల 210 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, ఇటు నిఫ్టీ రెండు పాయింట్ల లాభంతో 8వేల 35 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. ఈ నేపథ్యంలో ఇవాళ హెల్త్ కేర్, చిన్న తరహ, మధ్య తరహ పరిశ్రమాల సమాఖ్యలతో పాటు ఎఫ్ఎంజీసీ రంగ సూచీలు లాభాలను అర్జించాయి. వీటికి తోడు అటో, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ రంగ సూచీలు కూడా స్వల్ప లాభాలను అర్జించాయి.

కాగా అయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ క్రమంలో కోల్ ఇండియా, భారతి ఇన్ఫ్రాటెల్, ఐడియా సెల్యూలార్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్ తదితర సంస్థల షేర్లు అత్యధికంగా లాభాలను అర్జించగా, టాటా మోటార్స్ (డీజిల్), రిలయన్స్, యస్ బ్యాంక్, హిండాల్కో, హీరో మోటోకాఫ్ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో పయినించాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles