పెద్ద నోట్ల రద్దుతో వెలవెలబోతున్న స్వర్ణకాంతులు No tax on ancestral gold; other exemptions announced too

Gold above 500 gram owned by married women can be seized

Arun Jaitley, Gold, Silver, narendra modi, demonetisation, black money, old rs 500 note, old rs 1000 note, currency crisis, september quarter gdp, india gdp rate

The finance ministry has said that there will be no seizure of gold jewellery to the extent of 500 500 gms per married lady and 250 gms per unmarried lady and 100 gms per male.

‘పెద్దనోట్ల’ రద్దుతో వెలవెలబోతున్న స్వర్ణకాంతులు.. 10నెలల కనిష్టానికి ధరలు

Posted: 12/01/2016 06:28 PM IST
Gold above 500 gram owned by married women can be seized

కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత దేశీయంగా తగ్గిన కోనుగోళ్ల నేపథ్యంలో బంగారు అభరణాలు పది నెలల కనిష్టస్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా డాలర్ ధరలు క్షీణించడంతో వాటి ప్రభావంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇటు దేశీయంగా కూడా పెద్ద నోట్ల రద్దు తరువాత దూసుకెళ్లిన బంగారం.. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పరమితులు, షరుతులు, హెచ్చరికలతో దేశీయంగా బంగారం ధరలు కూడా పది నెలల కనిష్టానికి చేరుకున్నాయి.

వరుసగా రెండో రోజు బంగారం ధరలు క్షీణించి, ఆరు నెలల కనిష్ట స్థాయికి దిగజారాయి. అంతర్జాతీయంగా వస్తున్న బలహీనమైన డిమాండ్తో పాటు దేశీయంగా జువెల్లరీ వ్యాపారాల నుంచి డిమాండ్ క్షీణించడంతో, బంగారం ధరలు దాదాపు 300 రూపాయల మేర పతనమయ్యాయి. బలమైన ఎకానమిక్ డేటాతో ఇతర మేజర్ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ రికార్డులు సృష్టిస్తోంది. దీంతో బంగారం ధరలు అతలాకుతలమవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచనుందనే సంకేతాలతో సురక్షితమైన ఆస్తులుగా పరిగణించబడే మెటల్స్ విలువ కొట్టుకొనిపోతుందన్నారు.

ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.244 నష్టంతో 29వేల దిగువకు రూ.28,141గా నమోదైంది. వెండి సైతం రూ.41,000 మార్కు దిగువకు వచ్చి చేరింది. రూ.735 నష్టంతో కేజీ ధర 40,700 రూపాయలుగా మార్కెట్లో నమోదైంది. పరిశ్రమ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్ తగ్గడంతో సిల్వర్ ధరలు తగ్గినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. గ్లోబల్గా బంగారం ధరలు 1.25 శాతం క్షీణించి ఒక్క ఔన్స్కు 1,173 డాలర్లగా నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitley  Gold  Silver  narendra modi  demonetisation  currency crisis  business  

Other Articles