నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 8700 మార్కుకు దిగువన నిఫ్టీ Sensex ends 87 points lower, Nifty50 slips below 8,700

Sensex ends 87 points lower nifty50 slips below 8 700

Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

The domestic equity market slipped into the negative territory, dragged by stocks of the Tata Group, which has plunged into a turmoil following the ‘shocking’ ouster of Chairman Cyrus Mistry as Tata Sons Chairman.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 8700 మార్కుకు దిగువన నిఫ్టీ

Posted: 10/25/2016 06:07 PM IST
Sensex ends 87 points lower nifty50 slips below 8 700

దేశ పారిశ్రామిక రంగంతో పాటు ఇటు దేశీయ మార్కెట్లను ఒక కుదుపు కుదిపిన టాటా గ్రూప్‌ తాజా వ్యవహారం దేశీయ సూచీలపై ప్రభావం చూపింది. టాటా సన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి సరస్‌ మిస్త్రీను తొలగించడంతో టాటా గ్రూప్‌ షేర్లపై ఆ ప్రభావం పడింది. ఈ ప్రభావంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదోడుకులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయం మార్కెట్లు ప్రారంభంతోనే నిఫ్టీ 20 పాయింట్ల నష్టపోగా, సెన్సెక్స్ మాత్రం వందపాయింట్లకుపైగా నష్టపోయింది. అయితే మార్కెట్లు ముగింపులో మాత్రం సెన్సెక్స్ 88 పాయింట్ల నష్టంతో ముగియగా, నిఫ్టీ కూడా నష్టాలబాట పట్టింది

ముగింపు సమయానికి 88 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ 28091 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ కూడా 18 పాయింట్ల నష్టంతో 8,691 పాయింట్ల వద్ద చేరి మరోమారు కీలకమైన 8700 మార్కుకు దిగువకు చేరింది. టాటా గ్రూప్ సంస్థలున్న అన్ని సూచీలు రమారమి నష్టాలలోనే పయనించాయి. టాటా మోటార్స్ సూచీతో అటో రంగం, క్యాపిటల్ గూడ్స్, ఎంఎంజీసీ, ఐటీ, టెక్నాలజీ మిడ్ క్యాప్ సహా అయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ సూచీలు నష్టాలలోనే పయనించాయి. కాగా బ్యాంకింగ్, బ్యాంకింగ్ అటో, కన్జూమర్ డూరబుల్స్, హెల్త్ కేర్, చిన్న తరహా సమాఖ్యాలు మాత్రమే స్వల్ప లాభాలను అర్జించాయి.

ఈ క్రమంలో అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, భారతి ఇన్ఫ్రాటెల్, భారతి ఎయిర్ టెల్, ఐసిఐసిఐ బ్యాంకు తదితర సంస్థల షేర్లు అధ్యధిక లాభాలను అర్జించగా, మహింద్రా అండ్ మహింద్రా, టాటా స్టీల్, గెయిల్, ఐడియా సెల్యూలార్, హెచ్ యు ఎల్, తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇదిలావుండగా, టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను ఉన్న పళంగా తొలగించడంపై వస్తున్న పుకార్లను సైరస్ మిస్త్రీ కొట్టిపారేశారు. గత 24 గంటలుగా జరిగిన తతంగమంతా ఆశ్చర్యకరమైనది కానప్పటికీ,  చాలా సెన్సిటివ్ అని మాత్రం మిస్త్రీ పేర్కొన్నారు.

ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అగౌరవమైన రీతిలో మిస్త్రీని తొలగించడంపై బోర్డు నిర్ణయంపై పల్లోంజి గ్రూప్, మిస్త్రీ కోర్టులో సవాలుచేయనున్నట్టు పలు టీవీ చానెల్స్ రిపోర్టు చేశాయి. ఈ మధ్యాహ్నం లోపు ఆయన బొంబాయి హైకోర్టు ఆశ్రయించనున్నట్టు పేర్కొన్నాయి. కానీ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి పబ్లిక్ ప్రకటన తప్పనిసరి అని షాపూర్జీ పల్లోంజి గ్రూప్, మిస్త్రీ పేర్కొన్నారు. షాపూర్జీ గ్రూప్ కానీ, సైరస్ మిస్త్రీ గ్రూప్ కానీ ఇప్పటివరకు కోర్టుకు వెళ్తున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles