వారంతంలో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు Sensex closes 52.66 points down, Nifty slides 6.35 points

Sensex closes 52 66 points down nifty slides 6 35 points

Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE, Hillary Clinton, Donald Trump, Hillary Clinton Donald Trum US Presidential Debate

The Sensex and Nifty ended marginally lower as investor risk appetite took a hit after a stronger dollar weighed on crude oil prices overnight and in Asian trading earlier in the day

వారంతంలో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 8700మార్కుకు దిగువన నిఫ్టీ

Posted: 10/21/2016 05:31 PM IST
Sensex closes 52 66 points down nifty slides 6 35 points

దేశీయ స్టాక్ మార్కెట్లను వారంతంలో నష్టాలు ముంచెత్తాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో ఉదయం ప్రారంభంలో లాభాల బాటలో పయనించిన మార్కెట్లను అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు ఉదయం నుంచి మార్కెట్లు ముగిసే వరకు లాభానష్టాల మద్య ఊగిసలాడాయి. తీవ్ర ఒడిదోడుకుల మద్య భారీగా నష్టపోయిన సూచీలను బ్యాంకింగ్ సూచీలు ఒకింత భారీ నష్టాల నుంచి కాపాడాయి.

ఆరంభంలో లాభాలతో ఆకట్టుకుని 50 పాయింట్లకు పైగా ఎగిసినా.. ఆ లాభాలను అధిమపట్టుకోవడంలో మార్కెట్లు విఫలమయ్యాయి. అది కాక నష్టాలలోకి జారుకుపోయాయి. చివరికి బ్యాంకింగ్ సంస్థల షేర్లు లాభాలను అర్జించడంతో భారీ నష్టాల నుంచి మార్కెట్లు స్వల్పనష్టాల్లో ముగిశాయి.ఈ క్రమంలో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టాలతో ముగియగా, అటు నిఫ్టీ కూడా ఎనమిది పాయింట్ల నష్టాలతో ముగిసింది. ఈ క్రమంలో 1450 సంస్థల షేర్లు లభాలను అర్జించగా, 1326 సంస్థల షేర్లు నష్టాలలో ట్రేడ్ అయ్యాయి. కాగా 248 సంస్థల షేర్లు తటస్థంగా నిలిచాయి.

ఈ క్రమంలో కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ సూచీలు మినహా అన్ని రంగాల సూచీలు లాభాలను అర్జించాయి. కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీ భారీ నష్టాలను మూటగట్టుకుంది. కాగా మిగిలిని అన్ని సూచీలు స్వల్ప లాభాలను మాత్రమే అర్జించాయి. మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య, ఐటీ సూచీల మినహా అన్ని సూచీలు స్వల్ప లాభాలను మాత్రమే అర్జించాయి. ఐడియా సెల్యూలార్, టెక్ మహీంద్రా, టాటా పవర్, హెచ్ సీ ఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ తదితర సంస్థల షేర్లు అధ్యధిక లాభాలను అర్జించాయి. కాగా ఏసీసీ, యాక్సిస్ బ్యాంక్, అంబుజా సిమెంట్స్, సిప్లా, హిండాల్కో సంస్థ షేర్లు అధిక నష్టాలను మూటగట్టుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles