నష్టాల్లో సూచీలు.. నాలుగువారాల కనిష్టస్థాయికి మార్కెట్లు.. Sensex, Nifty settle at over 4-week low

Sensex nifty settle at over 4 week low

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

The Sensex fell 70.58 points to settle at 28,223.70 and the Nifty shed 16.65 points to settle at 8,706.40. The indices moved in a narrow range in positive terrain till late trade before slipping into the red as European stocks reversed intraday gains.

నష్టాల్లో సూచీలు.. నాలుగువారాల కనిష్టస్థాయికి మార్కెట్లు..

Posted: 09/27/2016 07:11 PM IST
Sensex nifty settle at over 4 week low

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను ఎదుర్కోన్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలు దేశీయ సూచీలు సాధించిన లాభాలను అవిరయ్యేలా చేయడంతో పాటు మార్కట్లను నష్టాలపాటు చేశాయి. క్రితం రోజు భారీ నష్టాలకు తోడు ఇవాళ్టి నష్టాలతో మార్కెట్లు ముగించే సమాయానికి సూచీలు నాలుగు వారాలా కనిష్టస్థాయికి చేరుకున్నాయి. ఉదయం ప్రారంభం నుంచి ఆర్జించిన లాభాలను యూరప్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల నేపథ్యంలో హరించుకుపోయాయి, ఫలితంగా దేశీయ సూచీలు నష్టాలలో ముగిశాయి.

దీనికి తోడు బ్యాంకింగ్ సూచీలు భారీగా పడిపోవడం.. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకుల షేర్లు కూడా పతనం కావడంతో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. వీటితో పాటు మెటల్, మైనింగ్ షేర్లు తిరోగమనం వైపు పయనించాయి, కాగా ఐటీ, టెక్నాలజీ సూచీలు లాభాలను గడించాయి. ఇవాళ మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 71 పాయింట్ల నష్టంతో 28,224 పాయింట్ల వద్ద, అటు నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 8,706 పాయింట్ల వద్దకు చేరాయి.

ఇవాళ్టి ట్రేడింగ్ లోకన్జైమర్ డ్యూరబుల్స్, ఐటీ, టెక్నాలజీ చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల సూచీలు లాభాలను గడించగా, మిగతా అన్ని సూచీలు నష్టాలను చవిచూశాయి, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ సూచీలు భారీ నష్టాలను అందుకున్నాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,11,47,282 కోట్లకు తగ్గింది. ఈ క్రమంలో అరబిందో ఫార్మా, టీసీఎస్, అంబుజా సిమెంట్, లుపిన్, విప్రో తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, హిండాల్కో, అదాని పోర్ట్స్, లార్సెన్, బిపిసిఎల్, భారతీ ఇన్ ట్రా టెల్ తదితర కంపెనీలు నష్టాలను ఎదుర్కోన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles