భారతీయ రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్ గా ఎవర్ని ఎంపిక చేయనున్నారనే వార్త మరోసారి ప్రముఖంగా నిలిచింది. ప్రస్తుత అర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వారసులుగా ఎవర్ని కేంద్రం ఎంపిక చేయనుందన్నదే అసలు విషయం. రఘురాం తర్వాత ఎంపికయ్యే వ్యక్తి భారత దేశ అర్థిక పరిస్థితిని గాడిన పెట్టగల సమర్థులా..? అలాంటి వారిని కేంద్రం ఎంపిక చేసిందా..? తాజాగా ఈ విషయంలో మీడియాలో వస్తున్న ఊహాగానాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్న రాజన్తో సమావేశం కావడంతో ఆయనే తదుపరి అర్బీఐ గవర్నర్ గా వ్యవహరించనున్నారా.. అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ ప్రచురించింది.
ఆర్బిఐ కదలిక చర్చకు దారితీసింది. దేశంలోని అగ్రశ్రేణి ఆర్థిక సంస్థ, దేశ కేంద్ర బ్యాంక్ గవర్నర్ ఆయనే అనే అంచనాలు హాట్ టాపిక్ గా మారాయి. కాగా రాజన్ పదవీకాలం పూర్తి కాకముందే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేసేది వెల్లడిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఎలాంటి వూహాగానాలకు తావులేదని ఇప్పటికే ఎంపిక ప్రక్రియ మొదలయ్యిందని వెల్లడించాయి. అలాగే నూతన గవర్నర్ ఎంపికకు ఎలాంటి ప్యానెల్‌ను ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశాయి. అటు సెప్టెంబరు 4వ తేదీతో రాజన్ పదవీ కాలం ముగియనుండటంతో ఆయన తన పదవికి వీడ్కోలు పలకనున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more