Sensex fall from 1-year high as ICICI Bank drops before results

Sensex ends 157 points lower nifty50 below 8650

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

The Sensex declined 0.6% at the close, falling from a one-year high reached on Thursday. The gauge has rallied 4% this month pushing up its valuations to a 15-month high.

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఏడాది గరిష్టస్థాయిని కోల్పోయిన సెన్సెక్స్

Posted: 07/29/2016 07:21 PM IST
Sensex ends 157 points lower nifty50 below 8650

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలనే ఎదుర్కోన్నాయి. క్రితం రోజు ఏడాది గరిష్టస్థాయిని అందుకున్న సెన్సెక్స్ ఇవాళ్టి నష్టాల నేపథ్యంలో ఆ స్థాయిని కోల్పోయింది. జపాన్ బ్యాంకు ద్రవ్య పరిపతి విధానాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో దాని ప్రభావం అసియా మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఈ తరుణంలో అసియా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. దీనికి తోడు మదుపరుల అమ్మకాల ఒత్తడి కూడా మార్కెట్లను తిరోగమనం బాట పట్టించింది. వీటికి తోడు పలు ప్రముఖ సంస్థల త్రైమాసిక ఫలితాలు కూడా అశించిన మేరకు ప్రగతిని సాధించకపోవడంతో మార్కెట్లు నష్టాలను ఎదుర్కోన్నాయి.

మార్కెట్ల ఇవాళ ఉదయం ప్రారంభమైనప్పటి నుంచే నష్టాలలో పయనించాయి. మధ్యాహ్నం తరువాత జరిగిన ట్రేడింగ్ నష్టాలు మరింతగా పెరిగాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 157 పాయింట్లు నష్టపోయి 28,052 వద్ద ముగిసింది. నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 8,638 వద్ద ముగిసింది. కంపెనీలు ప్రకటిస్తున్న నిరాశజనకమైన తొలి త్రైమాసిక ఫలితాలు, బ్యాంకు స్టాక్స్ లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి, స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదుచేశాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇవాళ మొత్తంగా 1221 సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, 1462 సంస్థల షేర్లు నష్టాలను ఎదుర్కోన్నాయి. కాగా 209 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి.

ఇవాళ్లి ట్రేడింగ్ అటో, హెల్త్ కేర్, అయిల్ అండ్ గ్యాస్, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల సూచీలు లాభాలను అర్జించాయి. కాగా బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిష్టీ, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీలు భారీ నష్టాలను ఎదుర్కోన్నాయి. కాగా ఎప్ఎంజీసీ, ఐటీ, మెటల్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ రంగాలకు చెందిన సూచీలు స్వల్ప నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలో ఏషిర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, జీ ఎంటర్టైన్మెంట్, లుపిన్, టాటా పవర్ తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, ఐసిఐసిఐ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, బీహెచ్ఇఎల్, హెచ్ డీ ఎఫ్ సి, బ్యాంక్ అఫ్ బరోడా తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles