Brexit fallout: Sensex crashes 605 points, Nifty takes 181-point hit

Sensex tanks 604 points nifty tad below 8100

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Sensex plunged by 604.51 points to 26,397.71, its biggest single-day fall in nearly four months, as a shock victory for 'Leave' camp in the UK referendum sent markets across the world into a tailspin

‘బ్రెగ్జిట్’ ఎఫెక్ట్.. కుప్పకూలిన మార్కెట్లు.. భయం వద్దన్న రాజన్..

Posted: 06/24/2016 05:38 PM IST
Sensex tanks 604 points nifty tad below 8100

బ్రిగ్జిట్ ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కోన్నాయి. యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అనే అంశంపై నిర్వహించిన రెఫరెండంలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఫలితాలు వెలువడుతుండటంతో.. వాటి ప్రభావం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. స్వేచ్ఛా, స్వతంత్రం కొరుకుంటున్న బ్రిటెన్ వాసుల నిర్ణయంతో స్టాక్ మార్కెట్ భారీగా పతనమయ్యాయి. అన్ని సూచీలు నిలువునా కుప్పకూలాయి.

ఇవాళ ఉదయం మార్కెట్ ప్రీ-ఓపెన్ సెషన్ లో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 634 పాయింట్లు పడిపోయింది. ఓపెన్ సెషన్ లో 940 పాయింట్ల వరకు పతనమైంది. తరువాత 800-700 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. అటు ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 280 పాయింట్లు పైగా నష్టపోయింది. అన్ని సూచీలు నేల చూపులు చూశాయి. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురాం రాజన్ మాత్రం నింపాదిగా ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బ్రెగ్జిట్ ప్రభావం భారత్ పై పెద్దగా ఉండదని అభిప్రాయపడిన నేపథ్యంలో మార్కెట్లు ఆయన వ్యాఖ్యలు నేపథ్యంలో కొంత మేరకు కోలుకున్న.. నష్టాలు మాత్రం ముంచెత్తాయి. ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్న నేపథ్యంలో స్థానిక సర్దుబాటు కోసం లిక్విడిటీ కల్పిస్తామని చెప్పిన రాజన్... ఈ విషయంలో ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని, గ్లోబల్ కరెన్సీతో పోలిస్తే భారత్ కరెన్సీ బలమైనదని పేర్కొన్న రాజన్... ఈ విషయమే భారత ఆర్థిక వ్యవస్థను బ్రెగ్జిట్ ప్రభావం నుంచి రక్షిస్తుందని చెప్పారు.

ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 604 పాయింట్లు నష్టపోయి 26,397 పాయింట్ల వద్ద ముగిస్తే, నిఫ్టీ 181 పాయింట్లు నష్టపోయి 8,088 పాయింట్ల వద్ద ముగిసింది. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, భారతీ ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, గెయిల్ సంస్థల షేర్లు స్వలంగా లాభపడ్డాయి. టాటా గ్రూప్ నకు చెందిన మూడు సంస్థలు టాటా మోటార్స్, టాటా మోటార్స్(డీ), టాటా స్టీల్ భారీ నష్టాలతో ముగిశాయి. హిందాల్కో, టెక్ మహీంద్రా సంస్థల షేర్లు కూడా నష్టాల బాట పట్టాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles