Sensex in bear hug: what made it plunge to a 2-year low

Shares plunge over 3 amid global slowdown fears

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

India shares tumbled as global slowdown concerns deepened and a renewed slide in European banking stocks worsened market volatility.

దేశీయ స్టాక్ మార్కెట్లను మరోమారు కుదిపేసిన బ్లడ్ షెడ్

Posted: 02/11/2016 05:21 PM IST
Shares plunge over 3 amid global slowdown fears

భారత స్టాక్ మార్కెట్లలో ఇవాళ బ్లడ్ షెడ్ కురిసింది. మదుపరులు పట్టపగలు చుక్కలు కనిపించాయి. వరుసగా నాలుగో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అమ్మకాల ఒత్తిడికి తోడు మార్కెట్ మరింతగా పడిపోవచ్చన్న ఆలోచనలతో షార్ట్ సెల్లింగ్... వెరసి బెంచ్ మార్క్ సూచికలు నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందున్న స్థాయికి పడిపోయాయి. మే 12, 2014 తరువాత నిఫ్టీ సూచిక తొలిసారిగా 7 వేల పాయింట్ల కిందకు దిగివచ్చింది. లిస్టెడ్ కంపెనీల్లో 95 శాతానికి పైగా నష్టాల్లో మిగలగా, మిగిలినవి నామమాత్రంగా లాభపడ్డాయి.

నమ్ముకున్న ఇన్వెస్టర్లకు చెందిన సుమారు రూ. 3.18 లక్షల కోట్ల సంపద పతన ప్రభంజనంలో కొట్టుకుపోయింది. అంటే మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ 18 నెలల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి అంతా ఒక్క రూపాయి కూడా ఆదాయాన్ని తెచ్చి పెట్టనట్టే. ఇలా జరగడం 2016లో రెండోసారి. జనవరిలో ఒక పర్యాయం ఈ పరిస్తితి ఎదురుకాగా, ఇవాళ మరోమారు చోటుచేసుకుంది. ఇక మార్కెట్ గరిష్ఠ స్థాయిలో అంటే నిఫ్టీ 9 వేలు, సెన్సెక్స్ 30 వేల పాయింట్లను దాటిన సమయంలో పెట్టిన పెట్టుబడి లాభాలను ఇవ్వలేదు సరికదా, 20 శాతం వరకూ నష్టాన్ని మిగిల్చినట్టు.

బీఎస్ఈలో మొత్తం 2,779 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 324 కంపెనీలు లాభాల్లోను, 2,359 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బుధవారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 89,55,889 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్ నేడు రూ. 86,34,913 కోట్లకు పడిపోయింది. నిఫ్టీ సూచికకు తదుపరి 6,930 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చని, అక్కడా నిలువకుంటే 6,700 పాయింట్ల వరకూ తక్షణ పతనం తప్పదని నిపుణులు హెచ్చరించారు.

కాగా, మార్కట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 807.07 పాయింట్లు పడిపోయి 3.40 శాతం నష్టంతో 22,951.83 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 239.35 పాయింట్లు పడిపోయి 3.32 శాతం నష్టంతో 6,976.35 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 3.27 శాతం, స్మాల్ క్యాప్ 4.64 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 3 కంపెనీల సంస్థల షేర్లు మాత్రమే లాభాల్లో పడిపోయాయి. సిప్లా, భారతీ ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, వీఈడీఎల్, టాటా మోటార్స్, బీహెచ్ఈఎల్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, కోటక్ బ్యాంక్, హిందాల్కో, టాటా పవర్, ఎంఅండ్ఎం, పవర్ గ్రిడ్ తదితర కంపెనీల సంస్థల షేర్లు నష్టపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles