HSBC says to shut down India private banking business

Hsbc to wind up private banking business in india

HSBC, HSBC India, wind up, private banking, business, wealth management services, Wealth managers, foreign bank, HSBC private banking, Foreign investments, Black money probe, economy

Global banking major HSBC today announced shutting down of its private banking business in India that offers wealth management services.

హెచ్ఎస్బీసీ సంచలన ప్రకటన.. భారత్ సేవలు..వైండ్ అప్..!

Posted: 11/27/2015 07:02 PM IST
Hsbc to wind up private banking business in india

ప్రైవేటు బ్యాంకింగ్ కార్యకలాపాల ద్వారా లాభాలను అందుకోవడంలో విఫలమవుతున్న హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ పీఎల్సీ, భారతీయ విఫణి నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు వెల్లడించింది. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియా నుంచి వెనక్కు మళ్లాలని భావిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. "వ్యూహాత్మక సమీక్ష తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. స్థిరమైన వృద్థి దిశగా పయనించేలా ఇండియాలో మా వ్యాపారాలను రివ్యూ చేస్తామని ఆయన తెలిపారు.

కాగా, ఇండియాలో కొనసాగుతున్న వేగవంతమైన వృద్ధిలో భాగస్వామ్యం పొందాలని వచ్చిన ఎన్నో విదేశీ వెల్త్ మేనేజ్ మెంట్ కంపెనీలు, ఇలా అర్థంతరంగా చాపచుట్టేస్తున్నాయి. భారత్ లో తమ వ్యాపారాలను విస్తరించి.. అన్ని పట్టణాలకు విస్తరింపజేసి.. ఎన్నో అవస్థలు పడిన తరువాత కూడా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. హెచ్ఎస్బీసీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇండియాలో ఫారిన్ వెల్త్ మేనేజ్ మెంట్ వ్యాపార తీరుతెన్నులకు ఉదాహరణగా నిలుస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HSBC India  wind up  private banking  wealth management services  

Other Articles