Gold May Plunge to Rs. 20500 Level India Ratings

Gold prices may plunge to rs 20500 level india ratings

Gold, global gold prices, India gold prices, India Ratings on gold, Gold prices, Gold demand, Gold jewellery, Fed rate hike, US interest rate hike, gold prices, gold prices in india, gold prices today, gold rate, gold rate today, gold rate in india, today gold rate, gold price, gold price today, gold price in india, gold rate in delhi, gold price in delhi, today gold rate in india, today gold rate in delhi, today gold price, today gold price in delhi, today gold price in hyderabad

Gold prices in India may even dip to Rs 20,500 per 10 grams, a level last seen about 5 years ago, in case of a rate hike by the Federal Reserve later this year, according to India Ratings and Research

ఫెడ్ రిజర్వు నిర్ణయమే కీలకం..రూ.20 వేలకు స్వర్ణం చేరుతుందని అంచనా

Posted: 07/30/2015 06:29 PM IST
Gold prices may plunge to rs 20500 level india ratings

అమెరికా ఫెడరల్‌ రిజర్వు సమావేశం నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఫెడ్ రిజర్వు నిర్ణయాలపై స్వర్ణం ధరల కూడా నిర్ధేశించబడుతుంది. ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచే నిర్ణయం తీసుకుంటే భారత్‌లో పది గ్రాముల బంగారం ధర 20,500 రూపాయలకు పడిపోయే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. ఇవాళ ముగియనున్న ఫెడ్ సమావేశం ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందోనన్ని ఆసక్తి సర్వత్రా నెలకోనగా, ఫెడ్‌ నిర్ణయాన్ని అనుసరించి బంగారం ధర తగ్గుతుందా..? లేక పెరుగుతుందా అన్న విషయమై క్లారీటీ వస్తుందని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది. ఫెడ్ నిర్ణయం మేరకు సమీప భవిష్యత్‌లో 20,500- 24,000 రూపాయల మధ్య కదలాడవచ్చని పేర్కొంది.

ప్రస్తుతానికి బంగారంపై నెగిటివ్‌ ఔట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఫెడ్‌ నిర్ణయాన్ని బట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 900-1050 డాలర్ల మధ్య కొనసాగవచ్చని అంచనావేసింది. అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితి తొలగేవరకు బంగారం ధరలు 2009 సంవత్సరానికి ముందరి స్థాయిలకు చేరే అవకాశాలు తక్కువని ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది. ఆర్థిక అనిశ్చితి ఉన్న తరుణంలో బంగారం ధరలు పెరగడం, అనిశ్చితి తొలగే తరుణంలో బంగారం ధరలు తగ్గడం జరుగుతుంటాయని తెలిపింది.

యుఎస్‌ రియల్‌ వడ్డీరేట్లు, బంగారం ధరలు విలోమ సంబంధ కలిగి ఉంటాయని, అలాగే బంగారం, డాలర్‌ ఇండెక్స్‌ కూడా విలోమ సంబంధం కలిగి ఉంటాయని ఇండియా రేటింగ్స్‌ తన నివేదికలో తెలిపింది. ప్రపంచ బంగారం డిమాండ్‌లో దాదాపు సగం వాటా భారత్‌, చైనాలదేనని, ప్రస్తుతం ఈ రెండుదేశాలు 2011-12 కొనుగోలు స్థాయిలను మెయిన్‌టెయిన్‌ చేస్తున్నాయని తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనాలో బంగారం డిమాండ్‌ 8 శాతం క్షీణించగా, భారత్‌లో డిమాండ్‌ 15 శాతం పెరిగిందని తెలిపింది. అయితే నికరంగా చూస్తే ప్రస్తుతం భారత్‌లో డిమాండ్‌ ఆరేళ్ల కనిష్ఠ స్థాయిల వద్ద ఉందని తెలిపింది.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold  India gold prices  India Ratings on gold  

Other Articles