Celkon Launches Campus A35K With Universal Remote

Celkon unveils campus a35k remote priced at rs 3199

Celkon unveils Campus A35K Remote, priced at Rs 3199, celkon, celkon campus a35k remote, celkon campus a35k remote price, celkon campus a35k remote price in india, celkon campus a35k remote specifications, celkon mobiles, mobiles

Celkon has launched a new Campus-series smartphone, the Campus A35K Remote, priced at Rs. 3,199.

సెల్ కాన్ ఏ-35కే వుంటే.. ఇక రిమోట్ తో పనిలేదు..

Posted: 07/05/2015 03:06 PM IST
Celkon unveils campus a35k remote priced at rs 3199

సాధారణంగా మీ ఇంట్లో ఎన్ని రిమోట్ వుంటాయి అనగానే.. టక్కున లెక్కపెడుతుంటారు ఎవరైనా.. ఎందుకంటే టీవీ కి ఒకటి, డివీడి ప్లేయర్ కి మరోకటి, ఏసీ ఇంకోకటి, ఇంకా ఇలా వారి స్థాయికి బట్టి వారిట్లో వున్న ఎలక్ట్రానిక్ పరికరాలకు మరికోన్ని రిమోట్ కంట్రెల్స్ ఎవరింట్లో అయినా ఉండాల్సిందే. అయితే ఏ రిమోట్ కనబడకపోయినా.. ఇబ్బందే. వెంటనే ఉరుకులు పరుగుల పెట్టి.. కొత్తదాన్ని తీసుకుంటాం. అప్పటి వరకు మనకు నిద్ర పట్టదు. సరికాదా అన్ని పనులు పక్కన బెట్టి మరీ రిమోట్ పనులు చేసేలా ఒకటికి పది సార్లు ఇంట్లోని పెద్దలు మనకు గుర్తు చేస్తుంటారు.

అయితే ఇకపై మీకు ఆ బాధ పడాల్సిన అవసరం మీకు రాకపోవచ్చు. అయితే ఇందుకు మీ వద్ద పెల్ కాన్ ‘‘ఏ 35కే’’ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అదేంటి అంటారా..? ఇదే ఆలోచనతో హైదరాబద్ కేంద్రంగా ఇటీవలే స్మార్ట్ పోన్ల తయారీ చేపట్టిన సెల్కాన్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూనివర్సల్ రిమోట్ తాలూకు హార్డ్ వేర్, స్టాఫ్ట్ వేర్ రెండింటినీ పోందుపరిచి దీని రూపోందించామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫీల్ అనే అంతర్జాతీయ సంస్థ అభివృద్ది చేసిన టెక్నాలజీ కారణంగా ఈ స్మార్ట్ ఫోన్ తో దాదాపు 500 బ్రాండ్ టీవీలను పనిచేయింవచ్చనని, అలాగే 700 వరకు సెట్ టాప్ బాక్స్ లకూ రిమోట్ కంట్రోల్ గా పనిచేస్తుందని కంపెనీ అధికారులు వివరించారు. రిమోట్ కంట్రోల్ తో పనిచేసే దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలూ ఇది ప్రత్యామ్నాయం కాగలదని సెల్ కాన్ అధికారులు చెబుతున్నారు. మనమూ ఒకసారి ట్రయల్ చేసి చూద్దామా..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : celkon  smart phone  universal remote  A-35K  

Other Articles