RBI Governor Rajan Asks Banks to Cut Lending Rates

Rbi cuts repo rate by 25 bps no change in crr slr

RBI cuts repo rate to 7.5 percent, Reserve Bank of India, RBI cut its key policy rate, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in March, Reporate Reverse Repo Rate, CRR SLR MSF

The Reserve Bank of India unexpectedly cut its key policy rate, the repo rate, by another 25 basis points to 7.5 percent, committing itself wholeheartedly to push for growth as inflation is on the softer side.

ఆర్బీఐ కీలక నిర్ణయం.. వృద్దిరేటు పెంపుపైనే దృష్టి..

Posted: 06/02/2015 12:42 PM IST
Rbi cuts repo rate by 25 bps no change in crr slr

ద్రవ్యోల్భనం నిలకడగా వుంటేనే కాని రెపో రేటును తగ్గించలేమని ముందు నుంచి చెబుతూ వస్తున్న రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ఇవాళ రెండో పర్యాయం ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన తరువాత సుమారు ఆరు పర్యాయాలు సమావేశేమైన ఆర్బీఐ రెండో పర్యాయం వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం జరిగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ముఖ్యంగా బ్యాంకు రుణాలను తీసుకోనున్న గృహ, వాహనాలదారులకు ఆర్బీఐ శుభవార్తను అందించింది.

ఆర్‌బీఐ గవర్నర్ రఘురామరాజన్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం వివరాలను మీడియాకు వెలువరించారు. రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలుచేసే వడ్డీరేటు) ను పావుశాతం తగ్గించిందని వెలువరించారు. నగదు. నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉంటాయని ప్రకటించింది. ఫలితంగా గృహరుణాలపై ఈఎంఐ తగ్గే అవకాశం ఉంది. ఈసందర్భంగా పెట్టుబడులు ఇంకా బాగా పెరగాలని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్తంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.. ఆర్థికరంగం ఇంకా కోలుకునే దశలోనే ఉందని ఆయన పేర్కొన్నారు.

రెపో రేటును తగ్గించడంతో రుణాలపై వడ్డీరేట్లు తగ్గటం ద్వారా ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాలని ఆర్బీఐ ఆకాంక్షించింది. మరోవైపు ద్రవ్యోల్బణం కట్టడిచేసేందుకు, రెపో రేటును తగ్గించాలని, అభివృద్ధికి ఊతం ఇవ్వాలని కేంద్రం గతంలో ఆర్బీయైకి సూచించింది. ప్రస్తుతమున్న 7.5 శాతం వడ్డీరేటు తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరాయి. కాగా గత జనవరి, మార్చిలో కూడా రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ప్రధానంగా ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం దిగిరావడంతో పెట్టుబడులకు ఊతమిచ్చి తద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత జోరందుకునేలా చేయడంపై ఆర్‌బీఐ దృష్టిపెట్టింది. ద్రవ్యోల్భణం జనవరి 2016 నాటికి 6శాతంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు రఘురామ్ రాజన్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuram Rajan  RBI  RBI rate cut  Repo rate  

Other Articles