Nifty ends May series below 8350; Vedanta, Tata Motors up

Sensex nifty hit lowest level in almost two weeks

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp

Overall in the May series, Nifty was up 1.7 percent while Sensex jumped 1.8 percent. CNX IT index rallied 4 percent, Oil & Gas was up 3.4 percent, Pharma gained 2.7 percent.

రెండు వారాల కనిష్టస్థాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Posted: 05/28/2015 09:42 PM IST
Sensex nifty hit lowest level in almost two weeks

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలలో ముగిసాయి. దీంతో దేశీయ సూచీలు రెండు వారాల కనిష్టస్థాయికి దిగజారాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల వాతావరణ నేపథ్యంతో పాటు అమ్మకాల ఒత్తడి నేపథ్యంలో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం నుంచే నష్టాలబాటలో పయనించిన మర్కెట్లు.. ఒక దశలో సెన్సెక్స్ రెండు వందల పాయింట్లకు పైగా కొల్పోగా, నిఫ్టీ కూడా 8300 మార్కు దిగువన ట్రేడ్ సాగించింది. రెండవ సెషన్ లో కాస్త పుంజుకున్న మార్కెట్లు నష్టాలను కొంత మేరకు తగ్గించుకున్నప్పటికీ నష్టాలలోనే ముగిసాయి.

జూన్ మొదటి వారంలో భేటీ కానున్న భారతీయ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను సవరించనుందా..? లేదా అన్న మిమాంసలో విదేశీ మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబర్చకపోవడంతో.. దేశీయ సూచీలు నష్టాలలో ముగిసాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 58 పాయింట్లు నష్టపోయి  27,507 వద్ద ముగియగా, నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 8,319 వద్ద ముగిసింది. సూచీలలో అటో, కన్జూమర్ గూడ్స్, ఎఫ్ ఎం జీసీ, ఐటీ, టెక్నాలజీ, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు లాభాలను ఆర్జించగా, హెల్త్ కేర్, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సూచీలు, మెటల్స్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ క్రమంలో వెదాంతా, టాటా మోటార్స్, బిపిసిఎల్; ఇన్ఫోసిస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బిహెచ్ఇఎల్  సంస్థలు లాభాలలో పయనించగా, సిప్లా, టాటా పవర్, సన్ ఫార్మా, మహింద్రా అండ్ మహింద్రా, భారతి ఎయిర్ టెల్ తదితర సంస్థలు నస్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles