Ram Charan’s ‘Trujet’ takes off – Turbo Megha Airlines flies finally!

Ram charan meghaa turbo renamed as trujet

Ram Charan’s ‘Trujet’ takes off Turbo Megha Airlines flies finally,Mega Power Star Ram Charan’s launched his airlines latest news, Ram Charan’s launched his airlines latest news,Ram Charan,Mega Power Star Ram Charan latest news,Ram Charan latest updates

Mega Power Star Ram Charan’s launched his airlines ‘Trujet’. The first flight reached Shamshabad Airport from Malaysia. Trujet is a 72 seater ATR aircraft.

నింగిలోకి ఎగిరిన రామ్ చరణ్ ‘ట్రూజెట్’ తొలి విమానం

Posted: 05/23/2015 10:41 PM IST
Ram charan meghaa turbo renamed as trujet

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా వున్న నటుడు రామ్‌చరణ్ తేజ, అటు వ్యాపారవేత్తగా కూడా రాణించేందుకు కదనరంగంలోకి దిగారు. రాంచరణ్ విమానయాన రంగంలోకి దిగుతున్న విషయం పాఠకులకు విధితమే. అయితే ఆయన సంస్థకు చెందిన మోగా టర్బో ఎయిర్ లైన్స్ కు చెందిన ‘ట్రూ జెట్’ తొలి విమానం హైదరాబాద్‌కు చేరుకుంది. ఏటీఆర్ 72-500 విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుందని, రెండో విమానం మరో వారం రోజుల్లో చేరుకుంటుందని టర్బో మెఘా ఎయిర్‌వేస్ ఫౌండర్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు.

విమానాలు ఎగరడానికి సంబంధించి డీజీసీఏ నుంచి మరో ఇరవై రోజుల్లో తుది అనుమతులు అందుతాయని అంచనా వేస్తున్నామని, జూన్ చివరి వారంలో విమాన సర్వీసులు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. తొలుత తిరుపతి, ఔరంగాబాద్, రాజమండ్రిలకు సర్వీసులను నడపనున్నారు. రామ్‌చరణ్ డెరైక్టర్‌గా ఉన్న టర్బో మెఘా ఎయిర్‌వేస్ ‘ట్రూజెట్’ పేరుతో హైదరాబాద్ కేంద్రంగా ప్రాంతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramcaran Teja  Brand ambassador  Tru Jet  

Other Articles