Vijay Mallya Says Only Shareholders Can 'Oust' Him from USL Board

United spirits board tells vijay mallya to quit

united spirits board tells vijay mallya to quit, Vijay Mallya, Vijay Mallya Says Only Shareholders Can 'Oust' Him from USL Board, United Spirits Ltd, United Spirits Board, Mallya, Vijay Mallya United Spirits, Board, Diageo, Kingfisher, Kingfisher Airlines, UB Group, United Spirits

Asked to quit United Spirits' board, Vijay Mallya struck a defiant note saying he 'intends' to continue as its Chairman and refuted the charges made by the company's board with regard to its prior-period accounts.

యూఎస్‌ఎల్ చైర్మన్‌గా మాల్యా తప్పుకుంటాడా..? లేక తప్పిస్తారా..?

Posted: 04/26/2015 07:13 PM IST
United spirits board tells vijay mallya to quit

విజయ్ మాల్యా ఒకనాడు ఆ పేరు చెబితే.. అందాలు, ఆడంబరాల కోసం నిత్యాన్వేషణ చేస్తున్న వ్యాపార దిగ్గజం అని కీర్తించేవారు. కానీ ఎప్పుడైతే కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ అంశం తెరమీదకు వచ్చిందో అప్పటి నుంచి ఆయనను ఈసడించుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువ. అందులో మరీ ముఖ్యంగా ఆయన జీతాలు చెల్లించిన ఉద్యోగులే అధికం. అది కాస్తా పక్కన బెడితే.. మాల్యా తన అనుబంధ సంస్థలకు నిధుల మళ్లించారన్న ఆరోపణపై యునెటైడ్ స్పిరిట్స్ (యూఎస్‌ఎల్) చైర్మన్, డెరైక్టర్ హోదాల నుంచి తప్పుకోవాలంటూ డయాజియో సంస్థ సూచించడం.. ఇప్పుడు కొత్త అంశం. దీనికి మాల్యా అంగీకరించని పక్షంలో ఆయన్ను తొలగించే అంశాన్ని షేర్‌హోల్డర్లకు ముందు ఉంచనున్నట్లూ స్పష్టం చేసింది.

డయాజియో సంస్థ డిమాండ్‌ను మాల్యా తోసిపుచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. మాల్యా సారథ్యంలోని యూబీ గ్రూప్ నుంచి యూఎస్‌ఎల్‌లో బ్రిటన్ కంపెనీ డయాజియో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే, 2013-14 ఆర్థిక సంవత్సరంలో యూఎస్‌ఎల్ భారీగా రూ. 4,489 కోట్ల మేర నష్టాలను ప్రకటించడంతో కంపెనీ ఆర్థిక పరిస్థితులపై డయాజియో విచారణ జరిపింది. ఈ నివేదిక ప్రకారం 2010-2013 మధ్య కాలంలో యూఎస్‌ఎల్ నుంచి వివిధ యూబీ గ్రూప్ కంపెనీలకు, ఆర్థిక సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్ యిర్‌లైన్స్‌కు ఇచ్చినట్లుగా చూపిన రుణాల లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది ఈ నేపథ్యంలో ఆయన హుందగా చైర్మన్, డెరైక్టర్ హోదాల నుంచి తప్పుకుంటారా..? లేక తప్పిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : usl chairman  Vijay Mallya  Diageo company  

Other Articles