Paytm forays into e-commerce competes with Flipkart

Paytm forays into e commerce to compete with likes of flipkart

Paytm forays into e-commerce, Paytm to compete with likes of Flipkart, Paytm competes with Flipkart, Mobile payment services provider Paytm, Paytm latest two applications, paytm wallet app to transfer money, individuals to display their products, paytm doesn"t charge commission, Alibaba's finance arm Ant Financial, Wallet app, seller app, PayTM, E-Commerce Services, Online retail giant

Mobile payment services provider Paytm has launched two applications, a wallet app that allows users to transfer money between them and a platform for small and medium-scale enterprises as well as individuals to display their products.

వాలెట్, సెల్లర్ యాప్ లతో ఈ కామెర్స్ లోకి పేటీయం

Posted: 04/25/2015 04:53 PM IST
Paytm forays into e commerce to compete with likes of flipkart

మొబైల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం తాజాగా ఈ-కామర్స్ సర్వీసులు ప్రారంభించినట్లు ప్రకటించింది. తద్వారా ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌తో కంపెనీ పోటీపడనుంది. ప్రస్తుతం ఈకామర్స్ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని, ఇప్పటిదాకా 33,000 పైచిలుకు విక్రేతలు తమ సైట్‌లో నమోదు చేసుకున్నారని పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి విక్రేతల సంఖ్య లక్షకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు.

ఈ కామర్స్ సేవల ద్వారా ప్రస్తుతం 1.5 బిలియన్ డాలర్లుగా ఉన్న తమ రెవెన్యూ రన్ రేట్ ఏడాది ఆఖరు నాటికి 4 బిలియన్ డాలర్లకు పెరగగలదని శర్మ చెప్పారు. నిర్దిష్ట కాల వ్యవధిలో షాపింగ్ సైటు ద్వారా అమ్ముడైన ఉత్పత్తులు, సేవల విలువను రెవెన్యూ రన్ రేట్‌గా పరిగణిస్తారు. తమ ప్లాట్‌ఫాంపై విక్రేతలు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, కొనుగోలుదారులు పేటీఎం ప్లాట్‌ఫాం ద్వారా చెల్లింపులు జరపాల్సి ఉంటుందని శర్మ వివరించారు. ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం ఆలీబాబా ఇటీవలే పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో ఇన్వెస్ట్ చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Wallet app  seller app  PayTM  E-Commerce Services  Online retail giant  

Other Articles