I-T return filing now is a cakewalk for Aadhar card holders

For aadhar card holders i t return filing now is a cakewalk

I-T return filing now is a cakewalk for Aadhar card holders, India business report, Electronic Verification Certification, Income tax returns, Central Board of Direct Taxes (CBDT), Aadhar Card, income tax, special

Aadhar Card holders need not to file income-tax returns physically. New ITR forms will link to Aadhar card and do away with the physical ITR-5 for those who are Aadhar-verified by the Electronic Verification Certification (EVC) system.

ఆధార్ కార్డు వుంటే.. ఐటీ చెల్లింపులు ఇక సులభతరం

Posted: 04/18/2015 04:09 PM IST
For aadhar card holders i t return filing now is a cakewalk

ప్రతీ ఏడాది అర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో నెలకొనే అందోళన అంతాఇంతా కాదుచ తమ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి వారు పడే శారీరిక శ్రమ చెప్పనలవి కాదు. ఆదాయ పన్నుదారుల వ్యవప్రయాలకు ఇక చీటీ చెల్లింది, ఎందుకంటే ఇకమీదట ఎలాంటి శారీరిక శ్రమ లేకుండా ఆదాయ పన్ను చెల్లింపు వివరాలను సంబంధిత శాఖ అధికారుల వద్ద జమ చేయవచ్చు. అదెలా అనుకుంటున్నారా..? ప్రతీ ఏడాది పన్ను చెల్లింపుదారులు పడుతున్న వ్యయ ప్రయాసలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఆధార్ కార్డు వున్న పన్ను చెల్లింపుదారులకు శారీరిక శ్రమ నుంచి మినహాయింపును కల్పించనుంది.

అంతేకాకుండా ఆదాయ పన్ను చెల్లింపుదారుల నుంచి నిత్యం వెల్లువెత్తతున్న ఫిర్యాదుల సంఖ్యను తగ్గించేందుకు కూడా ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న కీలక నిర్ణయంతో లాభం చేకూరనుంది. ఆధార్ కార్డు వున్న ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఇకపై ఆన్ లైన్ లోనే తమ పన్ను వివరాలను దాఖలు చేసేందుకు ఆధార్ అనుసంధాన ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ సర్టిఫికేషన్ విధానాన్ని ఆదాయ పన్ను శాఖ అందుబాటులోకి తీసుకుంచ్చింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఫైలింగ్ విధానం అమల్లోకి రానుంది, ఈ విధానంలో తాము ఎంతో మంది కోత్త పన్న చెల్లింపుదారుల వద్దకు కూడా చేరే అవకాశముందని ఐటీ అధికారులు చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles