Apple working on a waterproof iphone

Apple working on waterproof iPhone, Apple filed patent water proof smartphone, United States Patent and Trademark Office, USPTO, apple smartphone technology protects against moisture and corrosion. Google, Microsoft, Samsung, Apple, apple consumer-grade products., Apple first waterproof iPhone, Apple plans to protect internal components, apple Plasma-Assisted Chemical Vapor Deposition (PACVA), apple I phone components will not short circuit. apple waterproof devices, Apple CEO Tim Cook, iPhones with waterproof case. water proof apple smart phones,

Apple has filed a patent with the United States Patent Office for a new technology that could lead to a waterproof iPhone.

త్వరలో ఆపిల్ నుంచి వాటర్ ఫ్రూఫ్ ఐ ఫోన్లు

Posted: 03/06/2015 07:30 PM IST
Apple working on a waterproof iphone

ఎలక్ట్రానిక్ పరికరాల దిగ్గజ సంస్థ అపిల్ మరో సరికోత్త ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోంది. వేల రూపాయలను ఖర్చుపెట్టి వినియోగిస్తున్న ఐ ఫోన్లలో ఎప్పటికప్పుడు కోత్త ఫీచర్లను పొందుపర్చి వినూత్న మోడళ్లలో ప్రపంచ వ్యాప్త వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్న ఆపిల్ సంస్థ ఇప్పుడు తాజాగా, వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తులపై దృష్టి సారించింది. త్వరలోనే వాటర్ ప్రూఫ్ ఐ ఫోన్లను తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.

మార్కెట్‌లోకి లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా ఉండాలనే సంకల్పంతో వాటర్‌ ప్రూఫ్ స్మార్ట్‌ ఫోన్ల నిర్వచనాన్నే సంపూర్ణంగా మార్చేయబోతోంది. ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న శ్యామ్‌సంగ్, సోనీ లాంటి స్మార్ట్‌ఫోన్లలో కేసింగ్‌కు మాత్రమే వాటర్‌ప్రూఫ్ ఉంటుంది. ఐఫోన్లలో అలా కాకుండా ఫోన్లలోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకు వాటర్‌ప్రూఫ్ ఉంటుంది. విద్యుదయస్కాంత కవచాలకు హైబ్రోఫోబిక్ కోటింగ్ (ఫ్లాస్మా అసిస్టెడ్ కెమికల్ వేపర్ డిపోసిషన్) ఇవ్వడం ద్వారా ఫోన్ లోపలి పరికరాలన్నింటిని నీటి నుంచి రక్షించే విధానంపై దృష్టి సారించింది. ఇందుకు గాను అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ కార్యలయం ( యుఎస్ పీ టీ ఒ) లో పేటేంట్ కోసం ధరఖాస్తు కూడా చేసుకుందని సమాచారం. దీంతోనే ఆపిల్ నుంచి మరో కొత్త వాటర్ ప్రూప్ స్మార్ట్ ఫోన్ వస్తుందని మీడియాకు సమాచారం అందింది.

కాగా, శ్యామ్‌సంగ్, సోనీ, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు రెగ్యూలర్ గా పేటెంట్ల కోసం ధరఖాస్తు చేసుకుంటాయని, వాటిలో చివరి ధశను పూర్తి చేసుకుని వినియోగదార వస్తువుగా చేరేయి మాత్రం కొన్ని వస్తువులేనని తెలిపింది. అయితే వాటర్ ప్రూఫ్ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం ఆపిల్ సంస్థకు అత్యంత అవసరంగా మారనుందని సమాచారం. ఈ మేరకు ఆపిల్ సంస్థ సీఈఓ టీమ్ కుక్ పరోక్ష సంకేతాను ఇచ్చారు. త్వరలోనే యాపిల్ నుంచి వస్తున్న చేతి గడియారాన్ని పెట్టుకుని వినియోగదారులు ఎక్కడికైనా వెళ్లవచ్చని, అసవరమైతే స్నానం కూడా చేయవచ్చని తెలుస్తోంది. ఆపిల్ వాటర్ ప్రూఫ్ కోసం చేపడుతున్న విధానం సక్సెస్ అయని పక్షంలో మరిన్ని వాటర్ ప్రూఫ్ ఎటక్ట్రానిక్ వస్తువులు అందుబాటులోకి రానున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : I phone  Apple  waterproof smartphone  

Other Articles