Rail budget disappoints markets

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, Railway budget 2015,

Rail Budget disappoints markets, BSE Sensex plunges 261 pts to close at 28,746 pts

స్టాక్ మార్కెట్లపై రైల్వేబడ్జెట్ ప్రభావం.. వరుస లాభాలకు బ్రేక్..

Posted: 02/26/2015 07:28 PM IST
Rail budget disappoints markets

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి రైల్వే బడ్జెట్ ప్రభావం ఇవాళ స్టాక్ మార్కెట్‌పై పడింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు తొలిసారిగా ప్రవేశపెట్టన బడ్జెట్ లో నూతన రైళ్లు, ట్రాక లైన్ల ఏర్పాటు లేకపోవడం, పైపెచ్చు సరుకు రవాణాలో సవరణలు సూచనలు దేశీయ సూచీలను నష్టాలను చవిచూసేలా చేశాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజామోద రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టనుందన్న వార్తల నేపథ్యంలో వరుస లాభాలకు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 312 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది.

కాగా తరువాత కొద్దిగా కోలుకున్న సెన్సెక్స్ 261 పాయింట్ల నష్టాన్ని చవిచూసి 28,746 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా భారీ నష్టాపోయింది. 83 పాయింట్ల నష్టంతో 8,684 వద్ద ముగిశాయి. ఎన్టీపీసీ, డీఎల్ఎఫ్, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్ టెల్ హెచ్ డీ ఎఫ్ సీ సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, బీహెచ్ఈఎల్, సన్ ఫార్మ ఇండస్ట్రీస్, ఇన్ ఫోసిస్, సిప్లా, హిండాల్కో బ్యాంక్ ఆఫ్ బరోడా, సన్ ఫార్మా, ఆసియన్ పెయింట్స్, ఐడీఎఫ్‌సీ నష్టాలు ఎదుర్కొన్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  Railway budget 2015  

Other Articles