Markets continue record setting spree sensex nifty hit new highs

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE

Markets continue record-setting spree; Sensex, Nifty hit new highs

రికార్డు లాభాలను నమోదు చేసుకున్న స్టాక్ మార్కెట్లు..

Posted: 01/27/2015 06:24 PM IST
Markets continue record setting spree sensex nifty hit new highs

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ రికార్డు లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 292 పాయింట్ల లాభంతో పరుగులు తీయగా, నిఫ్టీ 75 పాయింట్ల లాభాంతో ముగిసాయి. నిఫ్టీ 8900 మార్కును తొలిసారిగా దాటింది. బడ్జెట్ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పారిశ్రామాభివృద్దికి దోహదపడుతుందని, అరుణ్ జైట్లీ కూడా ప్రోత్సాహకాలను అందించనున్నారన్న వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. కొత్త ఆర్థిక సంవత్సరం సందర్భంగా రిజర్వు బాంకు కూడా పలు సిఆర్ఆర్, రెపో రేటు, రివర్స్ రెపో రేటులను తగ్గించనుందన్న వార్తల నేపథ్యంలో దేశీయ ముదపురులు కొనుగోళ్లతో సూచీలు ర్యాలీని కొనసాగించాయి. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్ల నిధుల సాయంతో మార్కెట్లు జోరు కొసాగుతోందని నిఫుణలు భావిస్తున్నారు.

సెన్సెక్ అత్యధికంగా 29 వేల 571 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 8 వేల 910 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ తొలిసారిగా 8900 మార్కును దాటడం గమనార్హం. యాక్సిస్ బ్యాంక్, సిప్లా, ఐసిఐసిఐ బ్యాంకు షేర్లు భారీ లాభాలను నమోదు చేసుకున్నాయి. ఐటీసీ లిమిటెడ్, హెచ్..డీ.ఎఫ్.సి బ్యాంక్, టాలా మోటార్స్, ఐటీసీ షేర్లకు ఆదరణ లభించింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఇన్పోసిస్ మహింధ్రా అండ్ మహింద్రా, కోల్ ఇండియా, హిందుస్థాన్ యూనీలీవర్ సహా పలు సంస్థల షేర్లు నష్టాలను చవి చూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles