Micromax online brand yu launches smartphone for rs 8999

micromax launches 4G phone, micromax yu launches smartphone, micromax 4G phone, Yureka Cyanogen operating system, micromax, domestic handset maker micromax, micromax yureka, yu yureka, online brand yu, micromax phone for Rs 8,999

Yu, the new brand from domestic handset maker Micromax, launched its first device named Yureka. The 4G device comes with Cyanogen operating system and is priced at Rs 8,999.

భారతీయ విపణీలోకి మైక్రోమాక్స్ తొలి 4జీ స్మార్ట్ ఫోన్

Posted: 12/19/2014 04:14 PM IST
Micromax online brand yu launches smartphone for rs 8999

అంచెలంచెలుగా భారతీయ విఫణీలో తన స్థానాన్ని పధిలపర్చుకుంటూ ముందుకు సాగుతున్న ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యు.. తన తొలి 4జీ డివైస్, యురేకాను ఆవిష్కరించింది. మైక్రోమాక్స్ శ్యానోజెన్ (ఈ ఓఎస్‌కు ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారం) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే యురేకా మొబైల్ ధర రూ.8,999. జోరుగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఔత్సాహికుల సెగ్మెంట్‌ను దృష్టిలోపెట్టుకొని యురేకా ఫోన్‌ను అందిస్తున్నట్లు మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ చెప్పారు.
 
ఆన్ లైన్ ద్వారానే అమ్మాకాలు...

ఈ ఫోన్‌కు ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ డాట్‌ ఇన్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్లు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. జనవరి రెండో వారం నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ డ్యుయల్ సిమ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టకోర్ ప్రాసెసర్, 64 బిట్ మల్టీ-కోర్ సీపీయూ, 5.5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్  కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. వచ్చే ఏడాది మార్చికల్లా యు బ్రాండ్ కింద మరిన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తామని పేర్కొన్నారు. నూతన ఫోన్లు యువతతో పాటు సాప్ట్ వేర రంగ నిపుణులను, ఉద్యోగస్థులను ఆకర్షిస్తుందని ఆయన రాహుల్ శర్మ ధీమా వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mobile  Micromax  4G device  Eureka mobile  

Other Articles