Demand in full swing for switzerland gold than sweden singapore australia

Demand for switzerland gold, switzerland gold imports in full swing, gold imports in current year, gold imports reaches Trillion ruppees, Trillion ruppees swiss gold imports, swiss gold imports

Demand in full swing for switzerland gold as trillion ruppees gold imported in this current year

స్విస్ కుందనానికి భలే గిరాకీ.. ట్రిలియన్ చేరువలో దిగుమతులు

Posted: 12/15/2014 05:00 PM IST
Demand in full swing for switzerland gold than sweden singapore australia

స్విట్జర్లాండ్ కుందనానికి గత కొంత కాలంగా దేశీయంగా భలే గిరాకీ లభిస్తోంది. స్విస్ బంగారానికి దేశీయంగా మంచి ఆదరణ లభిస్తుండటంతో క్రమంగా దిగుమతులు కూడా బాగా పుంజుకున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో (2014) ఇప్పటివరకూ దిగుమతైన పసిడి విలువ రూ. లక్ష కోట్ల(ట్రిలియన్) సమీపానికి చేరింది. దేశీయంగా లక్ష కోట్ల రూపాయల స్థాయిలో ఇందుకు అక్టోబర్ నెల కూడా జత కలిసింది. అక్టోబర్‌లో స్విస్ నుంచి దేశానికి రూ. 18,000 కోట్ల(2.8 బిలియన్ ఫ్రాంక్‌లు) విలువైన బంగారం దిగుమతి అయ్యింది. అంతకుముందు ఆగస్ట్‌లోనూ 2.2 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల విలువైన దిగుమతులు నమోదుకావడం గమనార్హం.

ఈ గణాంకాలను స్విస్ కస్టమ్స్ పాలనా విభాగం తాజాగా విడుదల చేసింది. దీంతో జనవరి మొదలు అక్టోబర్ చివరివరకూ మొత్తం 14.2 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల(రూ. 93,000 కోట్లు) విలువైన బంగారం దేశానికి దిగుమతి అయ్యింది. పసిడి ట్రేడింగ్ ద్వారా దేశంలోకి నల్లధనం దిగుమతి అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ గణాంకాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Switzerland gold  gold import  Black money  India  Trillion  

Other Articles