Google announces the great online shopping festival 2014 from 10th to 12th december

ecommerce india, Google, gosf 2014, online discounts, Great online shopping festival, online shopping festival, online shopping, 11th to 12th December, flip kart, Big Billion day

Google announces the Great Online Shopping Festival 2014 from 10th to 12th December

'గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్'ను ప్రకటించిన గూగుల్

Posted: 11/25/2014 01:48 PM IST
Google announces the great online shopping festival 2014 from 10th to 12th december

ఫ్లిఫ్ కార్ట్ బిగ్ మిలియన్ డే రోజున ఏకంగా కోట్లాను కోట్ల రూపాయల మేర అమ్మకాలను జరపడంతో.. ఆ పంథాలో పయనించేందుకు అన్ని ఈ కామెర్స్ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే రెండు పర్యాయాలు గ్రేట్ ఆన్ లైన్ షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించిన గూగుల్ ఇండియా కూడా మరో పర్యాయం ఆన్‌లైన్ కొనుగోళ్ల పండగ మళ్లీ నిర్వహించనుంది. 'గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్' (జీఓఎస్ఎఫ్) మూడో విడతను వచ్చే నెల 10 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్ల సంస్థవ వర్గాలు తెలిపాయి.  450 భాగస్వామ్య సంస్థలు ఇందులో తమ ఉత్పత్తులను పోందుపర్చనున్నాయని గూగుల్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

మోటరోలా నెక్సెస్ 6, హెచ్‌పీ, లెనోవా, టాటా హౌసింగ్, కార్బన్, వ్యాన్ హ్యూసన్, ఏషియన్ పెయింట్స్ తదితర కంపెనీల ప్రత్యేక ఆవిష్కరణలు ఇందులో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. నెక్సెస్ 6ను భారత్‌లో విడుదల చేయడానికి కూడా జీఓఎస్ఎఫ్ వేదికను గూగుల్ ఉపయోగించుకోనుంది. మోటరోలా అభివృద్ధి చేసిన నెక్సెస్ 6.. ప్రస్తుతం రూ.43,999 ప్రారంభ ధరతో ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యంకానుంది. కొత్త కొనుగోలుదార్లను ఆకర్షించే ఉద్దేశంతో.. ప్రత్యేకంగా రూ.299 విభాగాన్ని ప్రారంభించనుంది. ఇందులో భారీ డిస్కౌంట్లతో ఉత్పత్తులు లభ్యంకానున్నాయి. ఈ విభాగంలో ఫిలిప్స్, జేబీఎల్, బెనెట్టన్, అలియా భట్ కలెక్షన్ తదితర బ్రాండ్ల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.

అలాగే ఇవాళ్టి నుంచి డిసెంబరు 8 మధ్య ప్రత్యేక కాంటెస్ట్‌ను జీఓఎస్ఎఫ్ డాట్ ఇన్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్ ద్వారా 14 నిమిషాల పాటు (రూ.2.5 లక్షల వరకు విలువున్న ఉత్పత్తులను) ఉచిత షాపింగ్ అవకాశాన్ని గెల్చుకునే ఆఫర్‌ను అందిస్తోంది. 'గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్.. సైబర్ మండేకి భారత్ వెర్షన్. ఆన్‌లైన్ పరిశ్రమ ముందుకు వెళ్ళడానికి ఈ వేదిక దోహదం చేస్తుంద'ని గూగుల్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ ఆనందన్ అన్నారు. ఆన్‌లైన్ కొనుగోళ్లపై వినియోగదారుల విశ్వాసం గత 12 నెలల్లో గణనీయంగా పెరిగిందని.. బహుళ జాతి సంస్థలే కాకుండా దేశీయ కంపెనీల వృద్ధికి ఇది దోహదం చేసిందని తెలిపారు. 2012లో తొలిసారి జీఓఎస్ఎఫ్‌ను ప్రారంభించిన గూగుల్ ఈ ఏడాదితో మూడో పర్యాయం నిర్వహిస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles