Rbi policy review rajan keeps interest rates unchanged

Raghuram Rajan, RBI monetary policy, RBI policy, Repo Rate, Reverse Repo Rate, India inflation, RBI, Reserve Bank of India, Sensex, Indian Stock market

RBI policy review: Rajan keeps interest rates unchanged

ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష: కీలక వడ్డీ రేట్ల యధాతథం

Posted: 09/30/2014 03:12 PM IST
Rbi policy review rajan keeps interest rates unchanged

కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. రెండు నెలలకోసారి సమీక్షించే నాల్గవ ద్రవ్య పరపతి విధానంపై అర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించింది. 8శాతం వడ్డీరేట్లు, నగదు నిల్వల నిష్పత్తి యథాతదంగా ఉంటాయని సమీక్ష అనంతరం రఘురామ్ రాజన్ తెలిపారు. స్వల్ప కాలిక అవసరాల కోసం తీసుకున్న రుణాలపై బ్యాంకుల రిజర్వు బ్యాంకుకు చెల్లించే రెపో రేటు 8 శాతం, వాణిజ్య బ్యాంకులు  డిపాటిజ్ చేసే స్వల్పకాలిక పొదుపుకు చెల్లించే రివర్స్ రెపోరేటు 7 శాతం, క్యాష్ రిజర్వు రేషియో (సీఆర్ఆర్)  4 శాతం రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ఆర్ బీఐ నిర్ణయం తీసుకుంది. స్టాట్యూటరి లిక్విడిటి రేషియో(ఎస్ఎల్ఆర్) ను 22 శాతం, ఎన్ డీటీఎల్ లలో కూడా ఎలాంటి మార్పులు లేకుండానే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ.. 2016 జనవరి నాటికి ద్రవ్యోల్భణాన్ని 6 శాతానికి వస్తుంధని ఆయన  ధీమా వ్యక్తం చేశారు. గడిచిన ఆగస్టు మాసం కంటే పస్తత పరిస్థతి చాలా మెరుగైనట్లు చెప్పారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడగానే..స్టాట్యూటరి లిక్విడిటి రేషియోను కూడా తగ్గిస్తామని చెప్పారు. ఆయిల్ ధరలు తగ్గడం లాంటి ద్రవ్యోల్భన తగ్గింపులో క్రియాశీలక పాత్ర పోషిస్తాయని ఆయన  చెప్పారు. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.5 వృద్దిరేటు అంచనాలను సాధన ధిశగా వెళ్తుందని ఈ క్రమంలో భవిష్యత్తు విధానం వైఖరిపై ద్రవ్యోల్భనం ప్రభావితం చేస్తుందని రఘురామ్ రాజన్ అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles