10 million iphone 6 iphone 6 plus sold in first three days apple

iPhone 6, iPhone 6 Plus, Apple, Tim Cook

10 million iphone 6 iphone 6 plus sold in first three days apple

ఆ ఫోన్ ‘రికార్డు’లను తిరగరాస్తుంది...

Posted: 09/23/2014 05:16 PM IST
10 million iphone 6 iphone 6 plus sold in first three days apple

ఆ ఫోన్ రికార్డులను తిరగరాస్తుంది..? నమ్మకం కలగట్లేదా.. నిజమండీ.. కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు మోత మోగిస్తోంది. అదే ఐ ఫోన్ సరికొత్త వర్సన్ 6, 6 ప్లస్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐ ఫోన్ తాజా మోడళ్లకు మంచి హప్ వచ్చింది. మార్కెట్ లోకి విడుదలైన వారం రోజుల్లోనే భారీ సంఖ్యలో ఐఫోన్6 అమ్ముడైనట్టు ఆపిల్ సంస్థ ప్రకటించింది. తొలి వారాంతంలో కోటి  పైగా ఐఫోన్లు అమ్ముడయ్యాయని వ్యాపార విశ్లేషకులు అంచనావేస్తున్నారు. స్టాక్ అందుబాటులో ఉంటే భారీ సంఖ్యలోనే ఐఫోన్ లు అమ్ముడయ్యే అవకాశం ఉండేదని ఆపిల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ వెల్లడించారు. సెప్టెంబర్ 12 తేది 40 లక్షల మంది వినియోగదారులు ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారని కంపెనీ వర్గాలు తెలిపారు.
 
తాజా అమ్మకాల ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీ నాస్ డాక్ పై కూడా కనిపించింది. నాస్ డాక్ లో ఆపిల్ 100.58 డాలర్లుగా నమోదు చేసుకుంది. తొలి త్రైమాసికంలో ఆపిల్ కంపెనీ రెవెన్యూ 9 శాతం పెరిగడం కాకుండా వాల్ స్ట్రీట్ అంచనాలను మించిందని బిజినెస్ అనలిస్ట్ జీనె మునస్టర్ తెలిపారు. గత సంవత్సరం విడుదలైన తొలి వారాంతంలోనే  ఐఫోన్ 5ఎస్, 5సీ మోడల్స్  చైనాతోపాటు 11 దేశాల్లో 90 లక్షల ఫోన్లు అమ్ముడైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : iPhone 6  iPhone 6 Plus  Apple  Tim Cook  

Other Articles