Natural beauty tips with potato

Natural beauty tips with potato

potatos, Health Tips, health tips for You, Beauty Tips, Natural beauty tips, skin care, beauty care

A very common vegetable, Potato have all its benefits related to skin care and beautyregime. Apart from consuming it just as a food, you can get advantage from it in variety of ways. Since potato is used in almost all the vegetable dishes, people do not need to engage much time in searching the particular ingredient. You just need to pick one potato and use it for variety of skin care and beauty care processes. It is a kind of vegetable that include good amount of starch in it which can be consumed but excess consumption of this vegetables is not good for health. But, fortunately potato has variety of beauty and skin benefits which people can enjoy availing even if they cannot consume the vegetable.

బంగారుదుంపలతో ’బంగారం‘లాంటి అందం

Posted: 12/01/2015 01:23 PM IST
Natural beauty tips with potato

తక్కువ ఖర్చులో అందాన్ని అద్భుతంగా కాపాడుకునే పద్దతుల్లో బంగాళదుంపతో రిమిడీలు చాలా బాగా పనికి వస్తాయి. వేలకు వేలు పెట్టి పార్లర్లలో చేయించుకునే ఫేషియల్ కన్నా బెటర్ లుక్ కోసం బంగాళదుంపను సరైన రీతిలో వాడి మంచి ఫలితాలను పొందవచ్చు. బంగాళదుంపను ఎన్ని రకాలుగా అందానికి పనికి వచ్చేట్లు వాడొచ్చో చూడండి..

నేచురల్ బ్లీచ్: చర్మం నల్లగా..కమిలినట్లు అనిపిస్తుంటే చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి, పొటాటో గుజ్జులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ముడతలు పోయేలా : బంగాళాదుంప రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళాదుంప రసాన్ని రాసిన చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. బంగాళదుంప గుజ్జులో కొద్దిగా పెరుగు జోడించి ముఖానికి మాస్క్ లా వేసుకొని 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముడుతలతో పాటు ఏజింగ్ లక్షణాలు కూడా తొలగిపోతాయి.

పొడి చర్మము : పొడి చర్మము ఉన్నవాళ్ళు తురిమిన బంగాళాదుంప మరియు అర చెంచా పెరుగు కలిపి దానిని మూకానికి రాసుకొని 20 నిమిషాల తరువాత కడుగుకుంటే మృదువుగా తయారవుతుంది.

చక్కని ఛాయకి : బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. అందులో కొద్దిగా ముల్తానీ మట్టి, నిమ్మరసం మిక్స్ చేసి ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువు అవడంతో పాటు, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేసుకుంటుంది. దాంతో ముఖం తాజాగా మారుతుంది. అలాగే బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది. దీన్ని ఫేస్ మాస్క్ లాగ అప్లై చేయాలి .

ఫేస్‌మాస్క్‌లు : ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే వరకూ ఉంచండి. మొదట గోరువెచ్చటి నీళ్లతో, తరువాత చన్నీళ్లతో కడిగేసుకోండి. అలాగే బంగాళాదుంపని బాగా ఉడకబెట్టి ముద్దలా చేయండి. చల్లారాక ఒక స్పూను పాల పౌడర్‌ని, ఒక స్పూను బాదం నూనెని కలిపి పేస్టులా చేయండి. దానిని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత శుభ్రపరుచుకోండి.

డార్క్ సర్కిల్స్ మరియు కళ్లకి మెరుపుకు : ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్లే. అయితే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కళ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్‌లో వేస్తే కొంచెం జ్యూస్‌ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుతాయి.పొటాటోను పేస్ట్ లా చేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి కంటి చుట్టూ అప్లై చేయాలి 10 నిముషాల తర్వాత శుభ్రం చేస్తే డార్క్ సర్కిల్స్ చాలా ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి.

టోనర్ గా: మీరు నేచురల్ టోనర్ కోసం చూస్తుంటే ఇది గ్రేట్ గా హెల్ప్ అవుతుంది. పొటాటో పేస్ట్ లో కొద్దిగా కీరదోసకాయ రసాన్ని మిక్స్ చేసి ముఖానికి పట్టించడం వల్ల టోనర్ గా పనిచేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : potatos  Health Tips  health tips for You  Beauty Tips  Natural beauty tips  skin care  beauty care  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more