the best beauty home remedies to remove dark circles under the eye | eye beauty tips | eye home remedies

Beauty home remedies to remove dark circles under the eye

dark circles remove tips, dark circles under the eye, dark circles get rid of tips, eye tips, eye beauty tips, beauty tips, beauty home remedies, beauty tips for eyes

beauty home remedies to remove dark circles under the eye : experts suggesting to use some beauty home remedies to remove dark circles under the eye.

కంటికింద నల్లటి వలయాలను నివారించాలంటే...

Posted: 11/17/2015 01:35 PM IST
Beauty home remedies to remove dark circles under the eye

కంటికింద వుండే చర్మం ఎంతో సున్నితంగా, పలుచగా వుంటుంది. ఇక్కడి చర్మంలో నూనె గ్రంథులు ఏమాత్రం వుండవు. అందుకే.. అలసిపోయినప్పుడు కంటికింద వుండే చర్మం కమిలిపోయినట్లు నల్లగా మారుతుంది. మరీ పని ఒత్తిడి, కళ్ళకు విపరీతమైన శ్రమకు గురిచేసే వారి కంటికింద నల్లని వలయాలు ఏర్పడుతాయి. తద్వారా అందంగా వుండే ముఖచర్మం ఒక్కసారిగా అందవిహీనంగా మారిపోతుంది. అంతేకాదు.. అనారోగ్యంగా వున్నట్లు కనిపిస్తారు. కాబట్టి.. ఎంత వీలైతే అంత త్వరగా వీటిని నిర్మూలించేందుకు ప్రయత్నించాలి. వీటిని నివారించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా...

* స్వచ్ఛమైన ఆల్మండ్ ఆయిల్ తీసుకుని కళ్ల చుట్టూ అప్లై చేసి, తేలిగ్గా మసాజ్ చేయాలి. ఇందుకు ఉంగరం వేలిని ఉపయోగిస్తూ ఒక్కో కంటికి ఒక్కో నిమిషం చొప్పున మసాజ్ చేయాలి. అలా చేసిన అనంతరం 15 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత తడిని దూదితో తుడిచేయాలి. ఇలా కొన్ని రోజులపాటు రెగ్యులర్ గా చేస్తే.. ఆ వలయాలు నివారించబడుతాయి. అప్పుడు చర్మసౌందర్యం తిరిగి పొందవచ్చు.

* ఒక పాత్ర తీసుకుని అందులో కీరా రసం, బంగాళదుంప రసాలను సమపాళ్లలో వేసుకుని, బాగా కలియబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాసి, 20 నిమిషాలపాలు అలాగే వుంచుకోవాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా, చాలా జాగ్రత్తగా కడిగేసుకోవాలి. బయటకు వెళ్లేముందు సన్‌స్క్రీన్‌ను కళ్లకింద అప్లై చేయాలి. ఒక చుక్క నీటిని అద్ది రాయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు.

* కళ్ళకింద నల్లటి వలయాలను పొటాటో దూరం చేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్, కంటికింద వలయాలను నివారించేందుకు ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. చర్మంలో మొటిమల మచ్చలను, మొటిమలను నివారిస్తుంది. బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసి ముఖం మీద మర్దన చేయాలి. బంగాళదుంపను పేస్ట్‌గా చేసి ముఖానికి పట్టించాలి. ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. వలయాలను నిర్మూలిస్తుంది.

* అవొకాడో కూడా కంటికింద నల్లటి వలయాలను నిర్మూలించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మానికి తగిన పోషణను, తేమను అందిస్తుంది. అంతే కాదు చర్మ ప్రకాశవంతంగా మారడానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి ఒక ఉత్తమ డైట్ వంటిది. అవొకాడో పేస్ట్ చేసి చర్మానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. తద్వారా చర్మసౌందర్యం మెరుగై, వలయాలు నిర్మూలించబడతాయి.

* నిమ్మ రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. స్కిన్ రాషెస్, బ్లాక్ హెడ్స్‌ను నివారిస్తుంది. నిమ్మకాయను రెండు భాగాలుగా కట్ చేసి ఒక భాగం తీసుకొనే ముఖం మొత్తాన్ని మర్దన చేయాలి. ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు, కంటికంద నల్లటి వలయాలు పూర్తిగా నిర్మూలించబడి, మెరుగైన చర్మసౌందర్యాన్ని పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dark circles under the eye  dark circle remove tips  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more