Experts Giving Some Simple Home Remedies To Get Glow Skin | Beauty Tips | Beauty Remedies

Home remedies to get glow skin beauty tips

glow skin remedies, skin beauty tips, skincare tips, glow skin beauty tips, skin home remedies, remedies for skin, solmon fish remedies, garlic benefits, honey skin benefits

Home Remedies To Get Glow Skin Beauty Tips : Experts Giving Some Simple Home Remedies To Get Glow Skin.

చర్మసౌందర్యానికి కొన్ని మెరుగైన చిట్కాలు...

Posted: 09/22/2015 12:37 PM IST
Home remedies to get glow skin beauty tips

చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చుకోవాలంటే... నిత్యం బ్యూటీ ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సహజంగా లభించే కొన్ని పదార్థాలతోనే సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవచ్చునని చెబుతున్నారు. ఆ చిట్కాలు మీకోసం..

* అల్లం, తేనె కాంబినేషన్‌లో కంటి కింద నల్లటి వలయాలకు చెక్ పెట్టవట్టవచ్చు. అల్లం చర్మానికి అవసరమయ్యే తేమను పోషణను అందిస్తుంది. చర్మం ముడుతలను నివారిస్తుంది. కళ్ళ క్రింద రక్త ప్రసరణ జరగడానికి సహాయపడుతుంది. అల్లం పేస్ట్‌లో కొద్దిగా తేనె మిక్స్ చేసి కళ్ళ క్రింది భాగంలో మసాజ్ చేయాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముడుతలను నివారిస్తుంది.

* సాల్మన్ ఫిష్‌ : ఈ చేపతో చర్మ సౌందర్యం మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ ఫిష్‌లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకు ఈ చేప స్కిన్ మాయిశ్చరైజింగ్, ఫ్రెష్ నెస్‌ను అందివ్వడంలో సహాయపడుతుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి సూర్య రశ్మి నుండి స్కిన్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది.

* తేనె : తేనె చర్మంకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. తేనెను నీరుగా లేదా ఫేస్ ప్యాక్‌లతో కలిపి అప్లై చేస్తే చర్మాన్ని తేమగా, హైడ్రేట్‌గా ఫ్రెష్‌గా ఉంచుతుంది. డ్రై స్కిన్‌కు చెక్ పెడుతుంది. ఇతర రెమెడీలతో పోల్చుకుంటే.. తేనె అన్నికంటే సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా ఎంతో సులభంగా పనిచేస్తుందని నిపుణుల సలహా.

* చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు దోసకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. దోసకాయ గుజ్జుతో చర్మం ప్రకాశవంతం అవుతుంది. కేవలం దోసకాయ గుజ్జును ముఖానికి రాయడం ద్వారా చర్మానికి తేమ లభిస్తుంది. ఈ ఫేస్ మాస్క్‌ను 20 నిమిషాల తర్వాత తొలగిస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.

* ఆలివ్ ఆయిల్ చర్మానికి తేమను, మాయిశ్చరైజర్‌ను పోషణను అందిస్తుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను కళ్ళ క్రింది భాగంలో అప్లై చేసి.. సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఇలా ఒక నెలరోజులు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది‌.

* కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి తగినంత తేమను అందిస్తాయి. ముడతలను నివారిస్తుంది. స్వచ్చమైన కొబ్బరి నూనెను కళ్ళ క్రింది అప్లై చేసి మర్దన చేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

* నట్స్ : వీటిలో విటమిన్ ఈ, సెలీనియం పుష్కలంగా వుంటాయి. అవి మొటిమలు, మచ్చలు, ఎక్జిమాను నయం చేయడంలో సమర్థవంతంగా పని చేస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : glow skin remedies  beauty tips for skin  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more