Milk Cream Remedy To Get Glow Skin | Home Remedies | Beauty Tips | Beauty Remedies

Milk cream remedy glow skin home remedies beauty tips

glow skin remedies, skincare tips, skincare remedies, glow skin home remedies, milk cream benefits, milk cream healthy remedies, skin health tips, skin beauty tips, beauty home remedies, glow skin tips

Milk Cream Remedy Glow Skin Home Remedies Beauty Tips : Experts Giving Suggestions To Use Milk Cream To Get Glow Skin.

పాలమీగడతో మృదువైన ముఖచర్మం..

Posted: 09/07/2015 03:08 PM IST
Milk cream remedy glow skin home remedies beauty tips

చర్మసౌందర్యాన్ని మెరుగుపరిచే రెమెడీల్లో పాలమీగడ ఒకటి. ఇందులో.. చర్మానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా లభ్యమవుతాయి. అందులో కొన్ని చర్మాన్ని ఆరోగ్యంగా వుంచడంలో ప్రముఖపాత్ర పోషిస్తే.. మరికొన్ని దాని అందాన్ని పెంచడంలో నిమగ్నమవుతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. అందుకే.. చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవాలంటే ఇతర బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం కంటే పాలమీగడ ఉపయోగిస్తే ఎంతో శ్రేయస్కరమని సూచిస్తున్నారు. అంతేకాదు.. వాతావరణం కాలుష్యం కారణంగా ముఖంపై మృదువుతనం కోల్పోతుంది. దాన్ని తిరిగి పొందాలంటే పాల మీగడ బాగా ఉపకరిస్తుందని చెబుతున్నారు.

రాత్రిళ్లు పడుకోబోయే ముందు ముఖానికి కొద్దిగా పాలమీగడను రాసుకుని, బాగా మర్దన చేయాలి. అలానే పడుకునే తర్వాత రోజు ఉదయం కడిగేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల ముఖంపై చర్మం మృదువుగా, ఆరోగ్యంగా తయారవుతుంది. అదే విధంగా కొద్దిగా ఆలివ్ నూనెను, రాసుకుని మర్దన చేస్తున్నా.. మరుసటి రోజుకు ముఖం తాజాగా, కోమలంగా కనిపిస్తుంది. కొందరికి పొద్దున్నే నిద్రలేవగానే ముఖం ఉబ్బినట్టుగా ఉంటుంది. ఆ సమస్యను తగ్గించుకోవాలంటే రాత్రి పూట తీసుకునే భోజనంలో ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ముఖానికీ, కంటి భాగంలో ఏదైనా మేకప్ వేసుకుంటే దాన్ని తప్పనిసరిగా తొలగించుకోవాలి. తరువాత కొద్దిగా మాయిశ్చరైజర్‌ని ముఖానికి రాసుకోవాలి. ముఖం కడుక్కున్న వెంటనే రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

పైన చెప్పబడిన రెమెడీలను రెగ్యులర్ గా పాటిస్తే.. చర్మసౌందర్యాన్ని త్వరగా పొందవచ్చు. వాటన్నింటిలో పాలమీగడ రెమెడీ ఎంతో శ్రేయస్కరం. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. పైగా చర్మం ఎంతో కోమలంగా, సాఫ్ట్ గా, తయారవుతుంది. ఫలితంగా చూడముచ్చటగా, ఎంతో అందంగా కనువిందు చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : glow skin remedies  milk cream remedy  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more