The Beauty Benefits Of Rose Petals Which Helps To Improve Glow Of Skin | Beauty Tips | Skincare Remedies

Rose petals beauty benefits home remedies skincare tips

rose petals beauty benefits, rose petals beauty tips, rose petals remedies, rose petals for skin, skincare remedies, skin beauty tips, skincare beauty tips, skin glow tips, glow skin remedies

Rose Petals Beauty Benefits Home Remedies Skincare Tips : The Beauty Benefits Of Rose Petals Which Helps To Improve Glow Of Skin.

గులాబీ రేకులతో ముత్యంలాంటి సౌందర్యం..

Posted: 09/03/2015 06:41 PM IST
Rose petals beauty benefits home remedies skincare tips

సువాసనలు వెదజల్లే గులాబీలంటే ప్రతిఒక్కరికీ చాలా ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలు వాటిని అమితంగా ఇష్టపడతారు. ఆ పువ్వులను తమ జడలకు వేసుకున్నప్పడు అవి వారి అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అంతేకాదు.. ఇవి సౌందర్యసాధనంగానూ ఉపయోగపడతాయని బ్యూటీషియన్లు అంటున్నారు. ఈ గులాబీ పువ్వుల రేకులు ముఖవర్ఛస్సును పెంచడంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయని వారు చెబుతున్నారు. మరి.. గులాబీ రేకులతో సౌందర్యాన్ని ఎలా మెరుగుపర్చుకోవాలో తెలుసుకుందామా..

* ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో పది గులాబీ రేకలను వేసి, గంటపాటు నానబెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఆ గులాబీ రేకులు మెత్తగా తయారవుతాయి. అప్పుడు వాటిని బాగా నలిమి, మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి రెండు టీ స్పూన్ల గులాబీ నీళ్లూ, మూడు టీ స్పూన్ల తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్తును పావు గంట ప్రిజ్‌లో వుంచిన తర్వాత.. ముఖంపై  వేళ్లతో  వలయాకారంగా పది నిమిషాలపాటు రాయాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఈ విధంగా రెగ్యులర్ గా చేస్తే.. మిళమిళ మెరిసేటి సౌందర్యం మీ సొంతం అవుతుంది.

* గులాబీ పువ్వులు పొడిబారిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా కూడా ఉపయోగపడతాయి. అందుకోసం.. ఒక పాత్రలో పది గులాబీ రేకలను వాటిని మెత్తగా చేసుకోవాలి. అనంతరం అందులో రెండు చెంచాల గులాబీ నీళ్లూ, రెండు చెంచాల తేనె, మూడు చుక్కల బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై వలయాకారంగా రాసుకోవాలి.  పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అంతే.. ఈ విధంగా రెగ్యులర్ గా చేసుకుంటే.. పొడిబారిన చర్మం దూరమవుతుంది. ఫలితంగా చర్మం మృదువుగా మారడంతోపాటు చర్మ సౌందర్యం మరింత మెరుగవుతుంది.

* ముఖంపై ముడతలు తగ్గిపోవాలంటే.. ముందుగా ఎనిమిది గులాబీ రేకలను మెత్తగా చేసి అందులో రెండు చెంచాల గులాబీ నీళ్లూ, చెంచా పెరుగు, చెంచా తేనె వేసి కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా కాకపోతే.. పది గులాబీలు, పది పుదీనా ఆకుల్ని మెత్తని మిశ్రమంలా చేయాలి. దీనికి చెంచా గులాబీ నీళ్లూ, గుడ్డులోని తెల్లసొన, చెంచా మొక్కజొన్న పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ముడతలు తగ్గుముఖం పడతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rose petals beauty benefits  skincare tips  beauty tips telugu  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more