The Onions Home Remedies To Get Beautiful And Healthy Hairs | Hair Care Tips

Onions home remedies for beautiful hairs

onions remedies, hair care tips, hair beauty tips, hair remedies, hair care remedies, hair beauty remedies, hair home tips, beauty hairs tips, white hair remedies

Onions Home Remedies For Beautiful Hairs : Beauticians giving some Onions Home Remedies To Get Beautiful And Healthy Hairs.

ఉల్లితో అందమైన జుట్టు మీ సొంతం!

Posted: 08/22/2015 12:15 PM IST
Onions home remedies for beautiful hairs

జుట్టు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించే మెరుగైన పదార్థాల్లో ‘ఉల్లి’ ఒకటి. ఇందులో పోషకాలు జుట్టును మరింత బలంగా మార్చి, వాటి పెరుగుదలకు దోహదపడుతాయి. ముఖ్యంగా ఉల్లిలో ఉండే సల్ఫర్ మూలకం తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా తలలో మూసుకుపోయిన రంద్రాలు తిరిగి తెరవబడతాయి. ఇక ఉల్లిపాయ రసం తలకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. జుట్టులో ఉన్న ఫంగస్ ని హరింపచేసి, చుండ్రును నివారించి, తెల్లజుట్టు నల్లగా మార్చుతుంది. అలాగే.. జుట్టు ఊడిపోకుండా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కల్పించే ఈ ఉల్లిరసాన్ని వారంలో 3 సార్లు తలకు పట్టిస్తే, రెండు నెలల్లో ఎన్నో ఫలితాలను గమనించవచ్చు.

ఉల్లి చిట్కాలు :

* ముందుగా ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటిని గ్రౌండర్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ఈ ఉల్లి పేస్టును ఒక బట్టలో తీసుకొని రసం పిండాలి. ఈ రసాన్ని తలకు పట్టించి, 5 నిముషాలపాటు మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేసిన అనంతరం 45 నిముషాలపాలు అలాగే వుండాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు త్వరగా తగ్గుతాయి. ఎందుకంటే.. ఉల్లిపాయ రసంలో ‘క్యాటలైజ్' ఎంజైమ్’లు పుష్కలంగా వుంటాయి.

* ఉల్లిపాయ నుండి జ్యూస్ ను సపరేట్ చేసిన తర్వాత మిగిలిన ఉల్లిపాయ గుజ్జుకు కొద్దిగా బీర్, కొబ్బరినూనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. అప్లై చేసిన ఒకటి రెండు గంటలు ఇలాగే ఉంచేయాలి. తర్వాత నిమ్మరసం కలిపిన నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. ఈ రెమెడీ హెయిర్ గ్రోత్ కు బాగా సహకరిస్తుంది. కేశాలు అందంగా మెరుస్తాయి. హాట్ వ్రాప్ చుట్టడం ద్వారా కేశకణాకలు కావల్సిన న్యూట్రిషియన్స్ పుష్కలంగా అందుతాయి. ఇలా వారంలో రెండు సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

* ఉల్లిపాయ నుండి రసాన్ని వేరుచేసుకొని అందులో రెగ్యులర్ గా ఉపయోగించే హెయిర్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల జుట్టు చిక్కుపడకుండా ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది.

* ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి, ఆ రసాన్ని తలకు, కేశాలకు పట్టించాలి. తర్వాత తలకు టవల్ చుట్టి 25-30నిముషాల అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. తల మాసిన వాసన శుభ్రంగా తొలగిపోతుంది.

* ఒక కప్పు బీర్ లో ఉల్లిపాయను రాత్రంతా నానబెట్టాలి. ఈ బీర్ తో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : healthy hair tips  onions remedies  

Other Articles

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more

  • Reduce your weight with ginger water

    జింజర్ వాటర్ తో బరువు తగ్గండిలా

    May 18 | నిత్యం మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ వంటి ధర్మాలతోపాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు... Read more

  • Actually excercises are useful for us but

    వంటికి వ్యాయామం మంచిదే... కానీ

    Jan 07 | వంటికి యోగా ఏంటి... ఏ వ్యాయామం అయినా మంచిదే... కానీ యోగా తో శారీరిక మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది... సరే, మీకున్న సౌకర్యాలని బట్టీ, ఇంట్రెస్ట్ ని బట్టి, ఎటువంటి విధమైన వ్యాయామం... Read more