The Best And Simple Remedies To Get Shining And Glowing Skin | Beauty Tips | Skincare Tips

Simple remedies for shining skin beauty tips

skincare tips, skincare remedies, glowing skin remedies, glowing skin beauty tips, shining skin tips, skin beauty tips, face wash, face packs

Simple Remedies For Shining Skin Beauty Tips : Beauticians Giving Some Best And Simple Remedies Which Helps To Get Shining And Glowing Skin Withing Few Days.

చర్మాన్ని కాంతివంతం చేసే నేచురల్ టిప్స్

Posted: 08/20/2015 12:49 PM IST
Simple remedies for shining skin beauty tips

నేటి ఆధునిక యుగం ఎంత కలుషితమైందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాతావరణంలో ప్రతిఒక్కరి అందం డీలా పడిపోతుంది. ఉదయం వెళ్లేటప్పుడు ముఖంపై వుండే అందం సాయంత్రానికల్లా మాయమవుతుంది. కాలక్రమంలో మరీ అందవిహీనంగా మారిపోతుంది. ఇలాంటప్పుడు బ్యూటీ ప్రోడక్ట్స్ తో ఉపయోగించి అందం పొందవచ్చు కానీ.. అంతగా ఫలితం వుండదు. చర్మం సహజత్వం కోల్పోవడమే ప్రధాన సమస్య. ఇలాంటి సమస్యను అధిగమించాలంటే బ్యూటీ ప్రోడక్స్ట్ కు బదులు కొన్ని నేచురల్ చిట్కాలు పాటిస్తే చాలు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* వేప : ముందుగా వేపాకులను నీటిలో ఉడకబెట్టాలి. ఆ నీరు చల్లారిన తరువాత ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ముఖం శుభ్రపడుతుంది. అలాగే.. ఒక పాత్రలో కొంచెం వేపాకు పౌడర్‌ను తీసుకొని అందులో గ్రేప్‌సీడ్‌ ఆయిల్‌ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మెత్తని మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

* తేనె-శెనగపిండి-చందనం : ఒక పాత్ర తీసుకుని అందులో తేనె, శెనగపిండి, చందనం, మీగడ తదితరాలను వేసి బాగా కలుపుకోవాలి. మెత్తని పేస్టులా కలిపిన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకోవాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీరుతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. చర్మం మృదువుగా అవుతుంది.

* ముల్తానీ మట్టిన : ఒక బౌల్‌లో ముల్తానీ మట్టిని తీసుకొని దానికి కొంచెం తాజా టొమాటో రసం కలపాలి. అనంతరం పసుపు, చందనం పౌడర్‌ను కూడా వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించుకోవాలి. కాసేపు తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఇలా రెగ్యులర్ గా పట్టిస్తే ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి.

* బియ్యం పిండి-టొమాటో రసం : ఒక పాత్ర తీసుకుని అందులో బియ్యం పిండి, టొమాటో రసం, పాలు, పసుపు తదితర పదార్థాలను వేసి బాగా కలుపుకోవాలి.  మెత్తని పేస్టులా చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకోవాలి. కాసేపు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా రెగ్యులర్ గా రాస్తే ముడతలు పోతాయి.

* తులసి ఆకుల : ముందుగా తులసి ఆకులను తీసుకుని వాటిని చూర్ణం చేసుకోవాలి. ఇలా చేసిన చూర్ణంలో కొద్దిగా పాలు వేసి బాగా కలుపుకోవాలి. మెత్తని పేస్టులా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకోవాలి. అనంతరం శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. ఆరోగ్యవంతమైన చర్మం సొంతమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : skincare remedies  glowing skin tips  home remedies for skin  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more