The Best Apple Face Masks To Get Beautiful Skin | Skincare Remedies | Beauty Tips

Apple face masks for beautiful skin home remedies

apple face masks, apple benefits, apple beauty tips, apple remedies, apple health benefits, apple tips, beauty tips, beauty remedies, best health tips, best beauty tips, apple masks, skincare tips

Apple Face Masks For Beautiful Skin Home Remedies : The Best Apple Face Masks To Get Beautiful Skin.

అందాన్ని పెంచే ఆపిల్ ఫేస్ మాస్కులు

Posted: 08/12/2015 12:56 PM IST
Apple face masks for beautiful skin home remedies

చర్మసౌందర్యాన్ని మెరుగుపరిచే సహజ పండ్లలో ఆపిల్ కూడా ఒకటి. ఈ ఆపిల్ లో విటమిన్ సి, విటమిన్ ఎ, కాపర్, మరికొన్ని స్కిన్ ఫ్రెండ్లీ న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. అవి చర్మసౌందర్యాన్ని పెంచడంతోపాటు ముఖంమీద వుండే మచ్చలు, ముడతలు, మొటిమలను పూర్తిగా నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇన్ని పోషకాలు నిండిన ఆపిల్ తో వివిధ పదార్థాలలో కలిపి ఫేస్ మాస్కులు చేసుకుంటే.. మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. మరి.. ఆ ఫేస్ మాస్కులు ఎలా చేస్తారో, వాటివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

* ఒక బౌల్ తీసుకుని అందులో ఆపిల్ తురుము, అందులో ఒక చెంచా పెరుగు, ఒక చెంచా నిమ్మరసం తదితర పదార్థాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్మూత్ గా చేసుకున్న తర్వాత స్కిన్ కు అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. దీనిని రెగ్యులర్ గా పట్టిస్తే.. ఆయిలీ స్కిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

* ఒక పాత్రలో కొద్దిగా ఆపిల్ తురుము, ఒక చెంచా దానిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి పూర్తిగా పట్టించి, 20 నిముషాలపాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా వుంటాయి కాబట్టి.. ఈ రెమెడీ చర్మాన్ని ఇన్ స్టాంట్ గ్లో వస్తుంది.

* ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఆపిల్ తురుము, కొన్ని చుక్కల గ్లిజరిన్ వేసి బాగా కలుపుకోవాలి. పేస్టులా తయారుచేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా ఈ ఆపిల్ రెమెడీని రెగ్యులర్ గా ముఖానికి పట్టిస్తే.. డ్రై స్కిన్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

* ఆపిల్ ముక్కలను సన్నగా తరిగి, అందులో తేనె, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తని పేస్టులా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గ్రీన్ ఆపిల్లో విటమిన్స్, నేచురల్ యాసిడ్స్ ఉండటం వల్ల.. చర్మంను తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.

* ఒక పాత్ర తీసుకుని అందులో ఆపిల్ తురుము, తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేసి.. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనిని రెగ్యులర్ గా అప్లై చేయడం చేసుకుంటే.. మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apple face masks  beauty tips  skincare tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more