The Best Monsoon Skincare Tips To Get Great Result Of Beauty | Beauty Tips | Home Remedies

Monsoon skincare tips to get best result of beauty

monsoon beauty tips, monsoon tips, monsoon remedies, monsoon home remedies, skincare tips, monsoon skincare tips, monsoon health tips, best remedies, honey benefits, honey beauty benefits, aloe vera gel, aloe vera gel benefits

Monsoon Skincare Tips To Get Best Result Of Beauty : Experts Giving Some Best Monsoon Skincare Tips To Get Best Result Of Beauty.

మాన్-సూన్ స్కిన్ కేర్ బెస్ట్ టిప్స్

Posted: 08/04/2015 03:04 PM IST
Monsoon skincare tips to get best result of beauty

వాతావరణ మార్పుల ప్రభావం చర్మసౌందర్యంపై ఎక్కువగా వుంటుంది. దాంతో చర్మం పొడిబారిపోవడంతోపాటు, మచ్చలు ఏర్పడటం, ముడతలు పడటం, ఇంకా రకరకాల సమస్యలకు గురవుతుంది. ఇలా సీజనల్ ప్రకారం వచ్చే చర్మసమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ‘మాన్సూన్ స్కిన్-కేర్ టిప్స్’ వున్నాయి. వాటిని తరుచుగా పాటిస్తే చాలు.. అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* టీట్రీ ఆయిల్‌ : తేయాకు నూనె, కొబ్బరి నూనెల మిశ్రమంతో తయారుచేయబడే ఈ నూనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ మిశ్రమంలో వుండే తేయాకు నూనె క్రిమిసంహారినిగా వ్యవహరిస్తుంది. చిన్న చిన్న పగుళ్లు, దద్దుర్లు, మొటిమలు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ రెమెడీని రెగ్యులర్ గా చర్మానికి పట్టిస్తే.. ఎంతో మంచిది.

* అలోవెరా జెల్ : ఇది చర్మానికి దివ్యౌషధంలా పనిచేస్తుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు ఇదో అద్భుతమైన విరుగుడు. చర్మంలోని రక్తకణాలను కూడా శుభ్రం చేసే శక్తి దీనికి వుంది. అలాగే చర్మంపై వున్న మొటిమలు, ముడతలను నివారిస్తుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పున ప్రతిసారీ.. ఈ జెల్‌ను రాసుకోవడం ఎంతో ఉత్తమం.

* తేనె : సహజసిద్ధమైన సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే.. ప్రకృతి సహజమైన తేనే ఎంతో శ్రేయస్కరం. ఇది పొడి చర్మానికి చక్కటి మందులా పనిచేస్తుంది. బ్రౌన్‌షుగర్‌, తేనె, ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మరసం తదితరాలను ఓ పాత్రలో కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌ లా వేసుకుంటే.. అద్భుతమైన ఫలితాన్ని గమనించవచ్చు.

* తాజాపండ్లు : తాజాగా వుండే మామిడి, దానిమ్మ పండ్లు చర్మం మీద మచ్చలు ఏర్పడకుండా కాపాడతాయి. జ్యూస్ లేదా నేరుగా తినడం లేదా రెమెడీల రూపంలో ఆ పండ్లను తీసుకోవచ్చు. ఇక పుచ్చకాయ రసంలోకి మిల్క్‌పౌడర్‌ను కలుపుకుని రాసుకున్నా కూడా చర్మం మీదున్న తాత్కాలిక మచ్చలు తగ్గుతాయి.

* యాంటీ ఫంగల్‌ పౌడర్‌ : వర్షాకాలంలో అతిపెద్ద సమస్య ఫంగస్‌. శుభ్రత లోపించినా.. లేకపోతే అపరిశుభ్రమైన వాతావరణంలోకి వెళ్లినా.. వెంటనే ఫంగస్‌ దాడి చేస్తుంది. వీటి బారి నుండి తప్పించుకోవాలంటే.. యాంటీ ఫంగల్‌ పౌడర్‌ను అద్దుకుంటే చాలు. చర్మసమస్యల బారిన పడకుండా సురక్షితంగా వుండొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : monsoon beauty tips  home remedies  aloe vera gel  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more