The Effective home remedies for persistent pimples | beauty tips | Skincare tips

Effective home remedies for persistent pimples beauty tips

pimples remedies, pimples beauty tips, tips to remove pimples, beauty tips, best remedies for pimples, pimples remove, skincare tips, skincare beauty tips, glow skin tips

Effective home remedies for persistent pimples beauty tips : Beauticians giving some Effective home remedies to get rid of persistent pimples.

మొండి మొటిమలను నివారించే ఇంటి చిట్కాలు

Posted: 07/11/2015 12:28 PM IST
Effective home remedies for persistent pimples beauty tips

సాధారణంగా మొటిమలు రావడం సహజమే కానీ.. కొన్ని మాత్రం మొండిగా తయారై ముఖంమీద తిష్టవేసి కూర్చుంటాయి. వాటిని నివారించేందుకు ఎన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ వాడినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం వుండదు. అలాంటి మొటిమల్ని పూర్తిగా నివారించాలంటే.. అందుకు అనుకూలంగా కొన్ని ఇంటిచిట్కాలను పాటిస్తే చాలు. ఆ రెమెడీలు వాటిపై ఎఫెక్టివ్ గా పనిచేసి పూర్తిగా నివారించడమే కాకుండా చర్మసౌందర్యాన్ని పెంపొందిస్తాయి. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* టూత్ పేస్ట్ : మొటిమల మీద అప్లై చేసిన తర్వాత డ్రై అయ్యే వరకూ అలాగే వుంచుకోవాలి. డ్రై అయిన తర్వాత మరోసారి టూత్ పేస్ట్ ని మొటిమలపై రాసి.. రాత్రంతా అలాగే వుచి కాసేపైన తర్వాత కాటన్ బట్టతో తుడిచేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. త్వరలోనే మంచి ఫలితాన్ని గమనించవచ్చు.

* అలోవెర : మొటిమలను నివారించడడంలో ఇదో ఎఫెక్టివ్ రెమెడీ. ముందుగా ముఖం శుభ్రంగా కడిగి.. తడి పూర్తిగా ఆరినివ్వాలి. ఆ తర్వాత కలబంద రసాన్ని ముఖానికి, మొటిమల మీద అప్లై చేసి డ్రై అయ్యేవరకు అలాగు వుంచుకోవాలి. అనంతరం రోజ్ వాటర్ తో ముఖం తుడిచేయాలి.

* పసుపు : ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక చెంచా పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను మొండి మొటిమల మీద అప్లై చేయాలి. కాసేపు ఉంచుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. వారానికోసారి చెప్పున నాలుగువారాలపాటు చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది.

* బాదం : బాదంను మిక్సీలో వేసి మెత్తగా, పొడిగా చేసుకోవాలి. ఈ పొడిలో రెండు చెంచాలా పాలు మిక్స్ చేసి. క్రీమ్ లా తయారుచేసుకోవాలి. ఈ క్రీమ్ మిశ్రమాన్ని మొండి మొటిమల మీద అప్లై చేయాలి. బాగా డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీరుతో ముఖం శుభ్రం చేసుకోవాలి.

* నిమ్మ-తేనె : ఒక బౌల్లో తేనె, రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత తిరిగి మరోసారి అప్లై చేయాలి. అరగంట బాగా ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pimples Remdies  Skincare Tips  Beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more